అమ్మ నా....భార్య నా
ఒక పెళ్లి వయసు వచ్చిన అబ్బాయి అంతర్గతంగా తనకు రాబోయే భార్య కోసం ఎంత ఎదురు చూస్తాడో తెలియదు కానీ.......అత్త గారు మాత్రం రాబోయే కోడలు కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది... ఆమె రాక కోసం పూజలు చేస్తుంది...దూరపు బందువులతోఁ సైతం ప్రేమగా మాట్లాడుతుంది....అడ్డమైన పెళ్లిళ్ల పేరయ్యలకు డబ్బులు ఇచ్చి...వచ్చే కోడలి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది.....
తన కొడుకుకి నచ్చిన పిల్ల కోడలిగా ఇంట్లో కి వస్తూనే అన్ని పనులు ఆరోగ్యం సహకరించక పోయినా పరుగులెత్తి మరి చేస్తుంది....దొంగతనంగా కొడలకేసి చూస్తూ ఉంటుంది.....తన ఊరి లో ఉన్న పండ్లు...పువ్వుల నుండి ఊరి చివర మొరిగే కుక్కలు ,నక్కల వరకు అన్నింటి గురించి చెబుతూ అన్నింటిని ఒక్కరోజు లో పరిచయం చేసేస్తుంది.........సాయంత్రం పొద్దు క్రుంగే లోపు బీరువా ఓపెన్ చేసి తనకు ఉన్న తక్కువ బంగారాన్ని ...తనకు తన పుట్టింటి వారు పెట్టిన కొన్ని బట్టల్ని.....కోడలికి నవ్వుతూ చూపిస్తూ.....కళ్ళ తో ఎవరన్నా ఉన్నారా అని గమినిస్తూ ఇవి నీకే అని మాట కూడా ఇచ్చేస్తుంది........ఇలా ఒకటేమిటి మూడు, నాలుగు సంవత్సరాలుగా తను ఊహించుకున్న ప్రేమనంతా ఒక వారం...మహా అయితే ఒక నెల లో కోడలికి చూపించేస్తుంది.....
నెల తర్వాత అత్తకి ఏదో బయటికి వెళ్లే పని పడుతుంది....కోడలు 7 గంటలు అయినా నిద్రలేవలేదు అప్పుడు మొదలవుతుంది....ఏంటి నువ్వు ఇంకాలేవలేదే ...పని పెట్టుకొని......అప్పుడు అత్త మీద ఎక్కువ అంచనాలు పెంచుకున్న కోడలు ....లోపల కోపగించుకుంటూ ఈవిడతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది..........కోపాన్ని పెంచుకుంటుంది...
ఎక్కడో పెరిగిన బిడ్డ...... మన ఇంటికొచ్చే కోడలు......... మూరెడు పసుపుతాడు మెడలో పడుతూనే ఉన్నపళంగా తన ప్రపంచాన్ని వదిలేసి మెట్టినింట్లో అందరూ బాగా చూసుకుంటారు అనే ధైర్యం తో కాలు పెడుతుంది.......తన భర్తను అమితంగా ఇష్టపడుతుంది.....భర్తకోసం అన్ని పనులు నవ్వుతూ చేసేస్తూ అతి తక్కువ సమయం లో భర్త యొక్క మన్ననలు పొందుతుంది......ఎప్పుడు భర్త ప్రతి పనికి తన మీద ఆధార పడొచ్చు అని భరోసా ఇస్తుంది..........
ఎప్పుడూ...... అమ్మా అది కావాలి ఇది కావాలి అని తిరిగే కన్న బిడ్డ ప్రతి పనికి భార్య మీద ఆదారపడుతుంటే ఆ తల్లి మనసు బాధ పడుతుంది....ఉన్నట్లుండి తన బిడ్డను...బిడ్డ ప్రేమను.. ఎవరో లాగేసుకున్నట్లు ఫీల్ అవుతుంది.కోడలు అంటే కోపం పెంచుకుంటుంది........
నిజానికి ....అక్కడ అత్త, కోడలు పోటీ పడేది ప్రేమను పంచడం కోసమే......every women feel like a queen of their kingdom..
ఇక్కడ..రాణి గా ఇద్దరు ప్రకటించుకున్నా రాజు గా ఒకరినే ఊహించుకుంటూ వాడికి ప్రేమను పంచడమే జీవితం అని భావిస్తారు..
కాబట్టి ప్రతి అబ్బాయి ఇద్దరిని రాణి ల గానే చూడాలి...ఇద్దరికి చెరొక రాజ్యానికి రాణి అనే భావనను కలిగించాలి.........