-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

సహజ పోషకాలు గల పానీయాలు సేవిద్దాము | Let's drink drinks with natural nutrients | prudhviinfo

Let's drink drinks with natural nutrients 


========================

సహజ పోషకాలు గల పానీయాలు సేవిద్దాము.


శీతల పానీయాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

ఈ క్రింది సహజ పోషకాలు ఇచ్చే పానీయాలను సేవిద్దాము.

🍉🍇🥒🌽🍌🥕🍉🍇🥒🌽🍌


1) కొబ్బరినీరు: 

ఇందులో 5 కీలక electrolights పొటాషియం,మెగ్నీషియం,ఫాస్పరస్,సోడియం,కాల్షియం లను కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచును.


2) మజ్జిగ: 

దీనిలోని ల్యాక్టోబాసిల్లస్ అనే మిత్ర కారక బ్యాక్టీరియా వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగును.ఇందులోని ల్యాక్టి కామ్లం పదార్థాలను త్వరగా జీర్ణం చేయును.ఇందులో పొటాషియం,క్యాల్షియం,రైబోఫెవిన్ ,విటమిన్ B-12 లభిస్తాయి.


3) సబ్జా నీరు:

 మహిళలకు అవసర మయ్యె పాలేట్, నియాసిన్, చర్మాన్నిఅందంగా ఉంచే విటమిన్ E అధికంగా కలిగి ఉండటం వలన శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ది చేస్తుంది.మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.


4) పుచ్చకాయ : 

గుండెజబ్బులు రాకుండా చేసే పొటాషియం సమృద్ధిగా ఉంటుంది.విటమిన్ A ఎక్కువగా ఉంటుంది.ఇందులో ఉండే LYKOPIN సూర్యరశ్మి లోని U.V కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.


5) తాటి ముంజలు :

6 అరటి పండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది బి.పి ని అదుపులో ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఎముకలను బలంగా ఉంచుతుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.


6) నిమ్మరసం: 

సిట్రిక్ ఆసిడ్ మూత్ర పిండాలలోని రాళ్ళను కరగదీస్తుంది.విటమిన్ సి ఎక్కువ. 

ఇందులో ఐరన్ ,ఫాస్పరస్ క్యాల్షియం ,మెగ్నీషియం పొటాషియం మూలకాలుంటాయి. ఇవి ,ప్రోస్టేట్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.మూత్ర పిండాలు గుండె,మెదడుల పనితీరుని మెరుగు పరుస్తాయి.


8) రాగి జావ: 

ఇది మధుమేహం, కీళ్ల నొప్పుల, acidity ని తగ్గిస్తుంది.

ఈ పానీయాలను సేవించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు.