హెల్త్ కేర్
భోజనం తిన్న తర్వాత నడక మంచిదే
భోజనం తిన్న తర్వాత నడక మంచిదే అంటున్నారు పరిశోధకులు. కాస్త గట్టిగా లాగించాక కూర్చోవటం లేదా త్వరగా నిద్రపోవడం వల్ల శరీరానికి అసలే మంచిది కాదంటున్నారు. ఇష్టమైన ఆహారమో, మాంసాహారమో. కనిపిస్తే కాస్త ఎక్కువ తింటాం. అయితే తిన్న తర్వాత నడక మంచిదే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎసిడిటీ సమస్యలుంటే పోతాయి. ముఖ్యంగా సోమరితనం వదులుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అసలు భోజనం తిన్నాక.. నడక మంచిదే! ! తర్వాత నడిస్తే మంచిదా? లేదా? అనే ఓ పరిశోధన చేశారు. ఇందులో 30 వేల మందిని వారానికి ఐదు రోజుల పాటు తిన్న తర్వాత నడిపించారు. ఇలా చేయడం వల్ల వారిలో గుండెకు సంబంధించిన రిస్క్ 20 శాతానికి తగ్గిపోయిందని తేలింది.
ఇంట్లో ఉన్నా, అవుడ్ ఊరికి వెళ్లినా గదిలో నడిచినా సరిపోతుంది. బయట ఉన్నారని పరిగెత్తడం, వేగంగా నడవడం వల్ల కడుపునొప్పి, వాంతులు అయ్యే అవకాశాలుంటాయి. అందుకే నడక మరీ చిన్నగా కాకుండా.. వేగంగా కాకుండా.. మధ్యస్తంగా ఉండాలి. ఫంక్షన్లు,.ఈవెంట్లో ఎక్కువ భోజనం లాగించినప్పుడు ఊపిరి ఆడకపోవడం, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నపుడు ఖచ్చితంగా నడవాలి. కేలరీలు బర్న్ కావడం వల్ల ఉపశమనం కలుగుతుంది. డయాబెటిస్తో బాధపడేవారు భోజనం తర్వాత చక్కెర శాతం పెరగకుండా చూసుకోవడానికి నడకను ఎంచుకోవడం మంచిది. ఏదేమైనా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఇలా ఏదైనా సరే తిన్న తర్వాత కడుపులో ఇబ్బందిగా ఉంటే. పది నిమిషాల పాటు నడవడం ఆరోగ్యానికి మంచిదే.