![]() |
Head migraine |
మైగ్రేన్ వేధిస్తుంటే..!
మైగ్రేన్ తలనొప్పి తరచుగా వేధిస్తున్నట్లయితే అవగాహన
జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఏం చేయాలంటే... డైటు మైగ్రేన్ కు సంబంధం ఉన్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడయింది. డైట్లో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా మైగ్రేన్ బాధించకుండా చూసుకోవచ్చు. ఆకుకూరలు, తృణధాన్యాలు, నట్స్ తీసుకుంటే మైగ్రేన్ బారినపడకుండా కాపాడుకోవచ్చు. సరైన సమయానికి నిద్ర పోవాలి. రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలా పాటు నిద్ర పోవాలి. నిద్రలేమితో బాధపడుతున్న వారిలో మైగ్రేన్ అటాక్స్ ఎక్కువ అని అధ్యయనాల్లో తేలింది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. అల్లం టీ తాగడం లేదా చిన్న అల్లం ముక్కను నమలడం వల్ల మైగ్రేన్ తలనొప్పి వల్ల వచ్చే వికారం తగ్గుతుంది.
• మెగ్నీషియం అధికంగా లభించే బాదం, పాలకూర, గుమ్మడికాయ విత్తనాలు మెనూలో ఉండేలా చూసుకోవాలి. తరచుగా వచ్చే మైగ్రేన్ తలనొప్పికి ఇది ఔషధంగా పనిచేస్తుంది.
• కళ్లు మూసుకుని రిలాక్సేషన్ టెక్నికను పాటించినా ఫలితం ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి దూరమయి తలనొప్పి తగ్గుతుంది.