-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

గో సంబంధిత ఉత్పత్తులు | Cow related products || prudhviinfo

ఆవు (గో సంబంధిత ఉత్పత్తులు)
(Cow - related products)


ఆవు (గో సంబంధిత ఉత్పత్తులు)
(Cow - related products)

1.ఆవుపాలు (Cow Milk) :

 వేడి, చలువ సమాన పాళ్ళలో ఉన్నందువలన అందదు. తీసుకోదగినవి. వీర్యపుష్టి, బలం కలుగజేస్తాయి, ఉబ్బ, వాతం, క్షయ, రక్తకృత్యం, తపైత్యం, అజీర్ణ సంబంధిత జ్వరాన్ని నివారిస్తాయి. ఆకలిని పెంచి, శరీ ప్రాణశక్తిని అందించి, ఆయుష్షును వృద్ధిచేస్తుంది.

గాయాలు త్వరగా మానుటకు ఉపకరిస్తాయి. స్త్రీలఅండాశయానికి బలo కలిగిస్తాయి. ఎక్కువగా తీసుకున్న శ్లేష్మం, పైత్యం, భారముగా అనిపిస్తుంది. దీనికి విరుగుళ్ళు తేనె, పంచదార, మజ్జిగ, నిమ్మరసం,

ఆవు ఈనిన 40 రోజుల తర్వాత నుండి వచ్చేపాలు అమృతంతో సమానం. ఉష్ణతత్త్వ శరీరం కలవారు పాలు ఎక్కువగా పుచ్చుకుంటే జ్వరం, గడ్డలు, ఉబ్బు, చర్మరోగాలు బయటపడతాయి. కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది.

2.ఆవుపెరుగు (Curds/Yogurt):

 ప్రాణశక్తి కలది, మేహశాంతి, పైత్యశాంతి చేస్తుంది. కొంచెం వేడి చేసినా పుష్టి, బలం, కాంతి కలుగజేసి ఆకలిని పెంచుతుంది. కొంచెం కఫం పెంచినా వాత పైత్యాలను తగ్గిస్తుంది.

3.ఆవు మజ్జిగ (Buttermilk) :

 చలువచేసి మేహ, పైత్యాలను శాంతింపజేస్తుంది.

రుచి పుట్టించి, జీర్ణక్రియను పెంపుచేస్తుంది. అనేక రోగాలకు పథ్యముగాతీసుకొనదగినది. సర్వకాలాలయందు తీసుకోదగిన త్రిదోషరహితమైన ద్రవ ఆహారము.

ఉదయం పరగడుపున ఒక లీటర్ మజ్జిగ తాగితే, శరీరములో అధిక వేడి తగ్గుతుంది మరియు అర్షమొలలు గ్యాస్ తగ్గుతాయి

నోటిలోని పుండ్లు మౌత్ అల్సర్ తగ్గుతుంది.

4 ఆవు వెన్న (Butter) : 

ఆయుర్ వృద్ధిని, వీర్యవృద్ధిని, ధాతుపుష్టిని కలుగజేస్తుంది. చలువ చేస్తుంది. కఫ, వాత, పిత్తముల నుపశమింప జేస్తుంది. మేహపైత్యాలను అణుస్తుంది, కళ్ళకు మేలుచేస్తుంది. శరీరానికి కాంతినిస్తుంది. ఆకలిని పెంచుతుంది. మూత్రం సాఫీగా రానివారు నిమ్మకాయంత వెన్నముద్దను పెద్దగ్లాసు నీళ్ళలో మరిగించి. పుచ్చుకొంటే, సాఫీగా జారీ అవుతుంది.

చిన్న పిల్లలకు ఆవు వెన్న తినిపిస్తే మేధస్సుపెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి

శ్రీ కృష్ణుని కథ చూసినప్పుడు చిన్నప్పుడు అధికంగా వెన్న తినేది 

అర్థము పిల్లలకు చాలా ఉపయోగం అని అర్థం చేసుకోవాలి.

5.ఆవు నెయ్యి (Ghee) 

ఆవుద్వారా ప్రకృతి ప్రసాదించిన అద్భుత వస్తువు నేయి. దీని గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయమే వ్రాయవచ్చు. ప్రాణశక్తి అధికస్థాయిలో కలిగిన వస్తువు. శరీరంలోకి తీసుకున్నా, యజ్ఞంలో ఉపయోగించినా ప్రాణవాయువును విడుదల చేసి ప్రాణికోటికి ఎంతో మేలు చేస్తుంది. ఒక గ్రాము ఆవు నెయ్యి, అగ్నిహోత్రంలో వేస్తే 1664 కేజీల ఆక్సిజన్ విడుదల ప్రతి ఒక్కరూ ఆవు పిడకలతో ఆవు నెయ్యి వేసి అగ్నిహోత్రం చేయుటవలన పర్యావరణాన్ని కాపాడిన వారవుతారు ఆవునెయ్యిలోని కొవ్వు పదార్థం మిగతా కొవ్వుల మాదిరి రక్తంలో కొలెస్టరాల్ను పెంచదు. కనుక అనుదినం మనం వాడదగినది. కొంచెం వేడిచేస్తే ఇది ద్రవరూపంలోకి మారుతుంది. ఇందులో విశేషతత్త్వం వలన ఆయుర్వేదంలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది 'పంచగవ్యములలో ఒకటి.

ఆవుని గోరువెచ్చగా చేసుకుని రోజు రాత్రి నిద్రించే ముందు, రెండు ముక్కల్లో రెండు చుక్కలు వేయడం వలన, గురక రెండు మూడు రోజుల్లోనే తగ్గుతుంది . నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉన్న వారికి హాయిగా నిద్ర వస్తుంది.

చాతి పైభాగం నుండి శిరస్సు వరకు వచ్చే దాదాపు నూట పది రకాల జబ్బులు నయం చేస్తుంది.

ఆక్సిజన్ లెవల్స్ ను పెంచుతుంది

ఆవు నెయ్యి 'త్రిదోషములు' లేనిది. రక్తపుష్టి, వీర్యవృద్ధి, ధాతుపుష్టి కల్గిస్తుంది. పిల్లలు మొదలు వృద్ధుల వరకు అన్ని వయసులవారికి హితమయినది. ఈ నేయి. రెండుమూడు చుక్కలు రాత్రి పడుకోబోయేముందు ముక్కులో వేసుకొని, పీల్చకుండా. దానికదే లోనికి జారేలా వదలాలి. ఒక చుక్కను వ్రేలితో తీసుకుని బొడ్డుకు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. నిద్రరానివారికి ఇది పరమ అద్భుతంగా పనిచేస్తుంది. ఆహారంలోను, ఔషధంగానూ ఇన్ని విశిష్టతలు కలిగిన గోసంబంధిత ఉత్పత్తులను అనుదినం ఉపయోగించడం వలన సకుటుంబంగా దాని లాభాలు పొందవచ్చు.


ఆవుపాలు తెచ్చుకుని, కాచి, తోడువేసి మజ్జిగ చిలుకగా వచ్చిన నేయిని మాత్రం ఆహారంగానూ, ఔషధంగానూ వాడడం మంచిది. వ్యాపారాత్మకంగా తయారు చేయబడి బజారులో దొరికే ఆవు నేయిలో కొన్ని ప్రకృతి సహజమైన శక్తులు (Natural Vital forces) ఉండనందువలన, దానిని వాడితే అంతగా విశేషమైన ప్రయోజనం. పొందలేం.

 గోవు ఉత్పత్తులు వాడండి,

గోశాల వారికి తగిన ఆర్థిక సహాయము గ్రాసము, సహాయం చేయండి. జెర్సీ ఆవు పాలు తాగడం ఆనారోగ్యాని కోని తెచ్చుకోవద్దు.

పంచగవ్య బంధువులు వాడండి ఆరోగ్యంగా జీవించండి