![]() |
Career guidance in telugu |
అనుభవాలు తెలుసుకోండి
* మీరు పనిచేసే చోటు, పనిగంటలు, జీతం, ప్రయోజనాలు... ఇలా అన్నింటి గురించి మీకున్న సందేహాలను సహోద్యోగులను కాకుండా మానవ వనరుల అధికారిని ముందే అడిగి తెలుసుకోండి.
* ఆఫీసు వాతావరణాన్ని గమనించి అందుకు అనుగుణంగా ఉండే ఆహార్యాన్ని ఎంచుకోండి.
* కొన్ని సంస్థలు పని వేళల్లో ఉద్యోగులు సోషల్ మీడియాను ఉపయోగించుకోవడానికి అంగీకరించవు. అలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయేమో ముందే కనుక్కోండి. ఆ ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ఎక్కువగా
ఉద్యోగంలో చేరిన మొదట్లో అంతా కొత్తగానే ఉంటుంది. వెళ్లిన మొదటి రోజే అన్నీ తెలుసుకోవాలని, నేర్చుకోవాలని అనుకోవడం అత్యాశ అవుతుంది. క్రమక్రమంగా అన్ని నేర్చుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలంటే ఉద్యోగినిగా కొన్ని పద్ధతులను పాటించాలి. అవేంటో చూద్దామా...
వినడానికే ప్రాధాన్యం ఇవ్వండి. సహోద్యోగులు, సీనియర్స్ చెప్పే సలహాలు, సూచనలు పాటించండి. సంస్థ గురించి తెలుసుకోండి.
* పని వాతావరణంలో అందరితో కలిసిపోవడానికి, మంచిగా నడుచుకోవడానికి ప్రయత్నించండి. స్నేహపూర్వకంగా మెలగండి.
* వీలైనంత మటుకు కార్యాలయానికి సమయానికి వచ్చేలా ప్రణాళిక వేసుకోండి అందుకనుగుణంగా మీ పనులు చేసుకోండి. అనుకున్న సమయం కంటే కాస్త ముందుగానే ఇంటి నుంచి బయలు దేరితే సమయానికి ఆఫీసుకు రాగలుగుతారు.