-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

కీళ్ళ నొప్పులు తగ్గాలంటే | health | prudhviinfo



 కీళ్ళ నొప్పులు తగ్గాలంటే


40, 50 సం॥లు రాకముందే కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కీళ్ళసందులో జిగురు తగ్గిపోయింది. వయసు వల్ల ఎముకలు అరిగి పోయాయి అంటున్నారు. ఎంత వరకువాస్తవము ?మనం ఏ తప్పు చేసినందుకు. జిగురు పోతున్నదో ఆలోచన చేయకుండా, వయసు మీద మోపుతున్నాము. మన శరీరము 100 సం||లు పనిచేయడానికి పుడితే కీళ్ళు 40, 50 సం॥లకే ఎందుకు పోతాయి. ఏనుగుకు కూడా ఆయుష్షు 100 సం॥లే. అంత బరువున్న ఏనుగుకు కీళ్ళ నొప్పులు గానీ, వాపులు గానీ, అరిగిపోవడం గానీ, జిగురు తగ్గడం గానీ ఎందుకు లేదు? ఏనుగుకి ఏది తినాలో బాగా తెలుసు. మనకు అన్నీ తినడం తెలుసు. మనం అన్నీ వండినవి తినడం వల్ల జిగురు తయారయే గుణం, అరుగుదలను నివారించే గుణం శరీరానికి పూర్తిగా నశించి పోతున్నదిపైగా ఆ ఉడికిన వాటిని 

 ఎక్కువగా ఇయోడిన్ఉప్పుతో తినడం వలన ఎక్కువైన ఉప్పు నీళ్ళ నందుల్లో పూర్తిగా పేరుకుని కీళ్ళను తినివేయడం, కార్టిలేజ్ ను పాడుచేయడం. "జరుగుతుంది. ఆ ఎక్కువగా ఉప్పును తిన్నంత కాలం ఎవరికి కీళ్ళు మళ్ళీ తిరిగి బాగుపడడం అనేది జరగడం లేదు. తప్ప నొప్పులు కీళ్ళ నొప్పులు రాకూడదన్నా, గానుగ నూనె లు వంట లో వాడండి

👉చిట్కాలు:- 

1) ప్రతీ రోజూ ఉదయం కాఫీలు మాని 7,8 గం॥ లకు పచ్చికూరల రసం త్రాగితే అందులో ఉండే సహజ లవణాల వల్ల కీళ్ళ మధ్యలో జిగురు తయారవుతుంది.

 2) ఉదయం టిఫిన్ క్రింద మొలకెత్తిన గింజలను తప్పని సరిగా తినాలి. అందులో నువ్వుల ఉండను తింటే కీళ్ళ అరుగుదలను నివారిస్తాయి. 

3)40 yers దాటిన వాళ్ళు సున్నం కంది బద్ద అంత రొజు మజ్జిగలో కలిపి త్రాగండి. క్యాలిషియం పెరుగుతుoది.

 4) మోకాళ్ళకు నువ్వులనూనె రాసి, వేడినీటి కాపడం 15 ని॥ల పాటు పెట్టుకొని, ఆ తరువాత మోకాళ్ళపై తడిపిన నల్లటి మట్టి (ఒండ్రు) వేసి పైన గుడ్డ చుట్టి 15, 20 ని॥లు ఉంచుకుని కడిగివేస్తే ఉపశమనం వస్తుంది. ఒండ్రుమట్టి లేని వారు తడిగుడ్డ చుట్టుకొని ఉంచుకోవచ్చు. పైన చెప్పినట్లు చేస్తే 2, 3 నెలల్లో తగ్గుతాయి. ఎవరికైతే నొప్పులు వచ్చి 5, 6 సం॥లు దాటుతుందో వారికి మాత్రం చాలా టైము పడుతుంది. ముదిరితే ఇలా చేసినా పూర్తి ఫలితం రాదు అందుచేత కొంచెం ప్రారంభమైనప్పుడే మేలుకుంటే పూర్తిగా పోతాయి.

5) తుమంబంక+పటిక బెల్లం/తాటి కలకండ సమ భాగాలుగా తీసుకొని పొడి చేసుకొవాలి.. 200గ్రాముల కు 10గ్రాములు జిల కర్ర పొడి కలుపుకోండి. రొజు 2పూటల తినడానికి గంటముందుగా 10గ్రాములు గోరువెచ్చని నీళ్లతో లేదా పాల తో కలిపి 100రోజులు వాడుట వలన కొత్త గుజ్జు పెరగడానికి సహాయపడుతుంది. మరియు నొప్పులు తగ్గుతా యి.

6) పచ్చి ఆముదం ఆకులు కచ్చ పచ్చ దంచి రాత్రి నిద్రించే ముందు మోకాళ్ల పై న కట్టు కుంటే మోకాళ్ళు నొప్పులు, కి ళ్ళ నొప్పులు తగ్గుతాయి.