![]() |
sindhu nagarikatha in telugu |
సింధు నాగరికతకు పట్టం కట్టిన యునెస్కో సింధు లోయ
నాగరికత విలసిల్లిన నగరాల్లో ప్రముఖమైనది ధోలావీరా. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితమే ఇక్కడ సింధు నాగరికత విలసిల్లింది. 1967-68 సంవత్స రాలలో ధోలావీరాలోని అవశేషాలను ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త జనరల్ జె.పి జోషి కనుగొన్నారు. తవ్వకాలు చేపట్టారు.1990 సంవత్సరంలో జరిగిన పూర్తిస్థాయి తవ్వకాలలో అనేక చారిత్రక అవశేషాలు లభ్యమయ్యాయి.
ధోలావీరా గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా బచావు తాలూ కాలో ఉంది. తొమ్మిది వందల సంవత్సరాల పాటు క్రీస్తుపూర్వం 2900 నుంచి క్రీస్తు పూర్వం 1500 వరకు ఈ నగరం విలసిల్లింది. సుమారు 120 ఎకరాల్లో చతురస్రాకారంగా ఆధునిక వసతులతో నగరాన్ని తీర్చిదిద్దారు. చుట్టూ అతిపెద్ద ప్రాకారాలతో కట్టడాలన్నీ కూడా రాతితో నిర్మించబడిన ఉన్నాయి.
" వ్యవస్థ,
సింధూ లోయ నాగరికతలో కట్టడాలన్నీ ఇటుకలతో ఉండగా కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే రాతి నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ జరిగిన తవ్వకాలలో బంగారు, వెండితో తయారు చేసిన వస్తువులు, జంతువుల ఎముకలు, దంతాలతో చేసిన వస్తువులు బయటపడ్డాయి. సుమారు 50వేల జనాభాతో విశాలంగా ఆధు నిక నాగరికత ఉట్టిపడే విధంగా నిర్మాణాలు బయటపడ్డాయి. మురుగు నీటి పారుదల వ్యవస్థ, మంచినీటి సరఫరా నగర నిర్మాణ శైలి, రాజ భవన నిర్మాణం, అధికారుల బంగళాలు
ఆనాటి అద్భుతమైన టెక్నాలజీకి తార్కాణాలు. సింధూ నాగరికతలో ముఖ్యమైన ఐదు నగరాల్లో ధోలవీరా ఒకటి. చైనాలో జరిగిన యునెస్కో సమావేశాలలో రామప్పతో పాటు ధోలవీరాను కూడా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం భారతీయులందరికీ గర్వకారణం. ఇప్పటి వరకు భారత దేశంలో 40 కట్టడాలు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడ్డాయి. సింధు నాగరికత ప్రాచీన నాగరికత. యునెస్కో గుర్తింపు ద్వారా సింధూ నాగరికతకు పట్టం కట్టినట్టు అయింది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు సింధూ నాగరికత విశేషాలు తెలుసుకోవడానికి యునెస్కో గుర్తింపు ద్వారా అవకాశం ఏర్పడింది. మున్ముందు మరిన్ని కట్టడాలు యునెస్కో గుర్తింపు పొందేలా ఆయా రాష్ట్రాలు, కేంద్రం తగిన చొరవ చూపాలి. తద్వారా ప్రాచీనమైన భారతీయ నాగరికత విశిష్టత ప్రపంచవ్యాప్తం అవుతుంది.