మన కరెన్సీ చిహ్నాలు
Incredible Unknown Facts About Currency symbols
📚 NEW INDIAN CURRENCY📚
RS 10
🔷Dimension - 63*123 mm
🔷Colour - Chocolate Brown
🔷Design - Konark temple
RS 20
🔷 Dimension - 63*129 mm
🔷 Colour - Yellow Greenish
🔷 Design - Ellora Cave
RS 50
🔷 Dimension - 66*135 mm
🔷 Colour - Fluorescent blue
🔷 Design -Hampi wite chariot
RS 100
🔷 Dimension - 66*142 mm
🔷 Colour - Lavender
🔷 Design - Rani Ki vav
RS 200
🔷 Dimension - 66*146 mm
🔷 Colour - Bright Yellow
🔷 Design - Sanchi stupa
RS 500
🔷 Dimension - 66*150 mm
🔷 Colour - Stone grey
🔷 Design - Red Fort
RS 2000
🔷 Dimension - 66*166 mm
🔷 Colour - Magenta
🔷 Design - Mangalyaan
రామప్ప దేవాలయాన్ని ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడంతో, దేశంలో విశిష్ట స్థానం పొందిన మరికొన్ని ప్రదేశాల గురించి తెలుసు కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం 2016 నుండి 2018 మధ్య 2000, 500, 200, 100, 50, 20, 10 రూపాయల కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసింది. మన దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించిన దరిమిలా కొత్త కరెన్సీ నోట్లపై ఆర్బీఐ వాటి చిహ్నాలను ప్రాధాన్యక్రమంలో ముద్రించింది.
వాటికి సంబంధించిన విజ్ఞాన సమాచారం చూద్దాం.
2000 నోటు:
![]() |
2000 rupees note |
ఈ నోటును 2016, నవంబర్ 8 న విడుదల చేశారు. ఈ నోట్లపై ముద్రించిన బొమ్మ మంగళయాది. 2013, నవంబర్ 5 న అంగారక గ్రహంపైకి భారత్ ప్రయోగించిన మొట్టమొదటి అంతరిక్ష నౌక చిహ్నాన్ని దీనిపై ప్రింట్ చేశారు.
500 నోటు:
![]() |
500 rupees note |
ఈ నోటును 2016, నవంబర్ లో ప్రవేశపెట్టారు. 17వ శతాబ్దంలో ఢిల్లీలో కట్టిన ఎర్రకోట యొక్క చిహ్నాన్ని ఈ నోటుపై ముద్రించారు. మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన షాజహాన్ తేదీ: మే 12, 1639 ఏప్రిల్ 6, 1648 మధ్య ఎర్రకోటను కట్టించాడు. ఈ అద్భుత కట్టడాన్ని 2007లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ప్రస్తావించింది.
200 నోటు:-
![]() |
200 rupees note |
![]() |
200 rupees note |
2017 ఆగస్టులో మొదటిసారిగా 200 నోటును విడుదల చేసారు. మౌర్య వంశ రాజైన అశోకుడు క్రీ.పూ 3వ శతాబ్దంలో కట్టించాడు. మధ్య ప్రదేశ్ లోని బౌద్ధ స్మారక చిహ్నమైన సాంచీ స్థూపం బొమ్మను దానిపై ముద్రించారు. ఈ కట్టడం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో నిర్మించబడింది. దాన్ని యునెస్కో 1989లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
100 నోటు:
![]() |
100 rupees note |
క్రీ.శ. 11వ శతాబ్దంలో నిర్మించిన రాణీకీవావ్ ప్రదేశాన్ని వంద రూపాయల నోటుపై ముద్రించారు. గుజరాత్ లోని పటాలో ఉన్న రాణికీవాపన్ను యునెస్కో 2014 లో పంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. సోలంకి రాజ వంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త రాజు భీమదేవతో ప్రేమకు చిహ్నంగా కట్టించింది.
50 నోటు:-
![]() |
50 rupees note |
క్రీ.శ. 14వ శతాబ్దంలో నిర్మించిన రథం కలిగిన హంపీ దేవాలయాన్ని యాభై రూపాయలు నోటుపై ముద్రించారు. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన ఈ అద్భుత నిర్మాణాన్ని 14 నుండి 16వ శతాబ్దం మధ్య విజయనగర రాజులు నిర్మించారు. ఇది 1986లోనే యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది.
20 నోటు:-
![]() |
20 rupee note |
క్రీ.శ. 600-1000 కాలంలో నిర్మించిన ఎల్లోరా గుహలను ఇరవై రూపాయలు నోటుపై ముద్రించారు. రాష్ట్రకూటులు, యాదవ రాజ్యవంశంలోని ఎల్లోరా గుహలు 34 గుహల సమూహం. ఇవి 6 నుండి 8వ శతాబ్దంలో చెక్కబడ్డాయి. ఇవి హిందూ, బౌద్ధ మరియు జైన దేవాలయాలకు నిలయాలు. 1983లో యునెస్కో సంస్థ ఎల్లోరా గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
10 నోటు:-
![]() |
10 rupee note |
క్రీ.శ. 13వ శతాబ్దానికి చెందిన కోణార్క్ సూర్య దేవాలయమును పది రూపాయలు నోటుపై ముద్రించారు. ఇది తూర్పు గంగా రాజ్యవంశం లోనిది. లాంగులా నరసింహదేవ అనే రాజు నిర్మించాడు. 24 చక్రాలు 24 గంటలను 7 గుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి. దీనికి కూడా యునెస్కో గుర్తింపు లభించింది.