_PRUDHVIRAJ
![]() |
Home tips for purifying the blood |
రక్తాన్ని శుద్ధపరచుకోవడనికి గృహ చిట్కాలు
మానవ శరీరం యొక్క అత్యంత కీలకమైన కణజాలాలలో (టిష్యూలలో) రక్తం ఒకటి. రక్త నాళాల నెట్వర్క్ శరీరాన్ని అంతా కలుపుతుంది. తద్వారా ఇది ఒకే యూనిట్‌గా పనిచేస్తుంది. రక్తం శరీరమంతా అవసరమైన పోషకాలు మరియు ఖనిజాలను సరఫరా చేయడమే కాక, వ్యర్ధాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. రక్తంలో ఉండే తేల్ల రక్తకణాలు మరియు యాంటీబాడీలు శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుండి రక్షిస్తాయి. రక్తం యొక్క కొన్ని ఇతర విధులు వీటిని:
ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ తీసుకొని శరీరంలోని వివిధ భాగాలకు అందించడం.
శరీర ఉష్ణోగ్రత మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహించడం.
లక్ష్య (టార్గెట్) అవయవాలకు హార్మోన్లను సరఫరా చేయడం.
అదనంగా, రక్తంలోని ప్లేట్లెట్లు గాయం తర్వాత రక్తస్రావం అధికంగా జరగకుండా రక్తం గడ్డకట్టేలా చేస్తాయి.
జీవనశైలి, పర్యావరణం మరియు కొన్ని రకాల ఆహారాలు రక్తంలో కొన్ని విష పదార్థాలు/టాక్సిన్లు పేరుకుపోవడానికి కూడా దారితీయవచ్చును . అవి ఫ్రీ రాడికల్స్, భారీ లోహాలు (heavy metals) లేదా ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా కావచ్చు. శరీర అవయవాలు, ముఖ్యంగా ఊపిరితిత్తులు, కాలేయం మరియు మూత్రపిండాల సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తంలో పోగుపడే వ్యర్థ ఉత్పత్తులు కూడా ఇందులో ఉంటాయి.
ఈ మూడు అవయవాలు (ఊపిరితిత్తులు, కాలేయం మరియు మూత్రపిండాలు) ప్రధానంగా రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు శుభ్రపరచడానికి బాధ్యత వహిస్తాయి. కాలేయం హానికరమైన రసాయన సమ్మేళనాలను తొలగించి రక్తాన్ని డిటాక్సిఫై చేస్తుంది. వాటిని (టాక్సిన్లను) మూత్రం ద్వారా బయటకు వెళ్ళేలా చేస్తుంది,, మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేసి అదనపు వ్యర్థాలను తొలగిస్తాయి. మరోవైపు, ఊపిరితిత్తులు రక్తాన్ని ఆక్సిజనేట్ చేయడంలో మరియు రక్తప్రవాహం నుండి హానికరమైన వాయువులను తొలగించడంలో కూడా సహాయపడతాయి.
ఇది కాకుండా, చనిపోయిన ఎర్రరక్త కణాలను (RBC) లను ఫిల్టర్ చేయడంలో మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తెల్ల రక్త కణాలను మెరుగుపరచడంలో ప్లీహము బాధ్యత వహిస్తుంది.
అంటువ్యాధులతో పోరాడటానికి యాంటీమైక్రోబయాల్ మరియు యాంటీఆక్సిడెంట్ చర్యలను అందించడంతో పాటు ఈ అవయవాల పనితీరును మెరుగుపరచడంలో కొన్ని మూలికలు మరియు ఆహార వనరులు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో రక్త శుద్దీకరణకు ఆహార మార్గం ఒక్కటే సరిపోదు. అనేక వ్యాయామాలు, యోగా భంగిమలు మరియు ప్రాణాయామం కూడా అద్భుతమైన ప్రత్యామ్నాయ చికిత్సలు. మొత్తం శరీర పనితీరును ప్రోత్సహించడంలో ఇవి కూడా సహాయపడతాయి.
ఈ వ్యాసంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడే వివిధ మార్గాలు, ఆహారాలు, పద్ధతులు, మరియు విధానాలను గురించి మేము తెలియజేశాము.
నీరు రక్తాన్ని శుద్ధి చేస్తుంది
రక్త శుద్దీకరణకు గ్రీన్ టీ
సహజంగా రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాలు
రక్తాన్ని శుద్ధి చేయడానికి మూలికలు మరియు మసాలాదినుసులు
రక్త శుద్దీకరణ కోసం యోగా మరియు శ్వాస వ్యాయామాలు
ఉపసంహారం
నీరు రక్తాన్ని శుద్ధి చేస్తుంది
ఏవిధమైన ప్రక్షాళన మరియు డేటాక్సిఫైయింగ్ (నిర్విషీకరణ) విధానాలను ప్రస్తావించినప్పుడు గుర్తుకు వచ్చే మొదటి విషయం నీరు.
మన శరీరం 75% నీటితో తయారవుతుంది. కాబట్టి, ఈ ద్రవాన్ని తరచూ మార్చుతూ ఉండడం వల్ల రక్తం నుండి విషాన్ని మరియు హానికరమైన పదార్థాలను శుభ్రపరచడంలో బాగా సహాయపడుతుంది.
రోజుకు 8-10 గ్లాసుల నీరు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాకుండా కిడ్నీ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
రక్త శుద్దీకరణకు గ్రీన్ టీ
గ్రీన్ టీ దాని డేటాక్సిఫైయింగ్ మరియు డైయూరేటిక్ లక్షణాల కోసం ఎక్కువగా ప్రసిద్ధి పొందిన పానీయం. గ్రీన్ టీ వినియోగం మూత్రం ద్వారా శరీరం పొటాషియం కోల్పోవడాన్ని తగ్గిస్తుందని జంతు అధ్యయనాలు సూచిస్తున్నాయి. గ్రీన్ టీ యొక్క క్రమమైన వినియోగం శరీరం యొక్క ఎలక్ట్రోలైట్ సమతుల్యతకు ఆటంకం కలగకుండా టాక్సిన్స్ బయటకు తొలగిపోవడంలో బాగా సహాయపడుతుంది.
దీనిలో వివిధ బయోలాజికల్ ఆక్టివ్ కెమికల్స్ మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కాలేయం మరియు మూత్రపిండాల నష్టాన్ని నిరోధిస్తాయి. అదే సమయంలో అవయవ పనితీరును బాగా మెరుగుపరుస్తాయి.
వాణిజ్యపరంగా మార్కెట్లో వివిధ రకాల గ్రీన్ టీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవడం రక్త శుద్దీకరణలో చాలా ఉపయోగపడుతుంది.
సహజంగా రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాలు
రక్తాన్ని శుద్ధి చేయడంలో అనేక రకాల ఆహార పదార్థాలు చాలా విధాలుగా ప్రభావవంతంగా ఉంటాయి, అవి:
శరీరం యొక్క సహజ నిర్విషీకరణ (డేటాక్సిఫైయింగ్) అవయవాలను బలోపేతం చేయడం. దీనిలో యాంటీఆక్సిడెంట్ ఆహారాలు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ పోగుపడడాన్ని నిరోధించి, తద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు శరీర సాధారణ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
రక్తంలో మైక్రోబియల్ లోడ్ (సూక్ష్మజీవుల పరిమాణాన్ని)ను తొలగించడంలో సహాయపడే యాంటీమైక్రోబయల్ పదార్థాలను కూడా అందించడం.
రక్తం నుండి అదనపు లవణాలు మరియు రసాయనాలను బయటకు తొలగించడానికి మూత్రవిసర్జన కారకాలను అందించడం.
అటువంటి కొన్ని ఆహారాలను మరియు వాటి లక్షణాలను, చర్యలను చర్చిద్దాం.
రక్తాన్ని శుద్ధి చేయడానికి బీట్రూట్
రక్త శుద్దీకరణ కోసం కాఫీ
రక్త శుద్ధికారులుగా ఆక్రోటు కాయలు
బ్లడ్ ప్యూరిఫైయర్‌గా బ్రోకలీ
రక్త శుద్దీకరణ కోసం ఉసిరి
రక్తాన్ని శుద్ధి చేయడానికి బీట్రూట్
బీట్రూట్ దాని హెపటోప్రొటెక్టివ్ (కాలేయాన్ని రక్షించే) లక్షణాలకు ప్రసిద్ధి చెందిన పండ్లలో ఒకటి. కాలేయ నష్టాన్ని తగ్గించడంలో మరియు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ప్రభావవంతమైన అనేక యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఇందులో ఉన్నాయని అధ్యయనాలు సూచించాయి.
జంతు-ఆధారిత అధ్యయనంలో, మోతాదు-ఆధారిత పద్ధతిలో (dose-dependent manner) బీట్రూట్ రసం కాలేయ గాయాలను కూడా మెరుగుపరుస్తుందని తెలిసింది. ఇంకా, ఇది విస్తృతమైన యాంటీమైక్రోబయాల్ చర్యలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.
కొన్ని క్యారెట్లు, నిమ్మకాయ మరియు అల్లంతో బీట్రూట్లను కలిపి బీట్రూట్ రసాన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోయే అవకాశం ఉన్నందున ఎక్కువ చక్కెర లేదా అడిటివ్స్ వేసుకోకుండా ఉండడం మంచిది.
రక్త శుద్దీకరణ కోసం కాఫీ
కాలేయ ఆరోగ్యానికి కాఫీ ఒక అద్భుతమైన పదార్థంగా నమ్ముతారు.
రోజుకు 2 కప్పుల కాఫీ త్రాగేవారికి కాలేయ వ్యాధులైన ఫైబ్రోసిస్, సిరోసిస్ వంటివాటి ప్రమాదం తక్కువగా ఉండటంతో పాటు కాలేయ క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
దెబ్బతిన్న కాలేయం అలనిన్ అమినోట్రాన్స్ఫిరేజ్ (alanine aminotransferase) మరియు ఆల్కలీన్ ఫాస్ఫేటేజ్ (alkaline phosphatase) వంటి కొన్ని ఎంజైమ్‌లను అధిక స్థాయిలో ఉత్పత్తి కూడా చేస్తుంది. క్రమమైన కాఫీ వినియోగం ఈ ఎంజైమ్‌ల యొక్క స్థాయిలను తగ్గించడంతో ముడిపడి ఉంటుంది. తద్వారా మెరుగైన కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అయితే, కాఫీ వినియోగం మూత్రపిండాలకు హానికరమని నమ్ముతారు, అందువలన ఈ విషయం కొంచెం వివాదాస్పదముగా (controversial) ఉంటుంది.
కాబట్టి కాఫీ తీసుకోవడంతో పాటు తగినంత నీరు తీసుకోవడం చాలా మంచిది.
రక్త శుద్ధికారులుగా ఆక్రోటు కాయలు
లిపిడ్ మెటబాలిజంలో (జీవక్రియలో) కలుగజేసుకోవడం ద్వారా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఆక్రోటు కాయలు తగ్గిస్తాయని కూడా కనుగొనబడింది. ఇది కాలేయ కణాల అపోప్టోసిస్ (సెల్ డెత్ [కణాల మరణం]) ను కూడా తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫలమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్‌గా, ఆక్రోటు కాయలు వివిధ శరీర అవయవాలలో వాపును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అదనంగా, అవి యాంటీప్రొలిఫెరేటివ్గా కూడా పరిగణింపబడతాయి, అంటే అవి కొన్ని క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా నిరోధిస్తాయి.
జంతు ఆధారిత అధ్యయనాలు ఆక్రోటు కాయలు కిడ్నీ క్యాన్సర్ పెరుగుదలను నిరోధిస్తాయని సూచిస్తున్నాయి.
ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించే ఆక్రోటు కాయలు ఆస్వాదించడానికి క్రమంగా కొన్ని ఆక్రోటు కాయలను తింటూ ఉండండి.
బ్లడ్ ప్యూరిఫైయర్‌గా బ్రోకలీ
కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో బ్రోకలీ అగ్రశ్రేణి ఆహారాల పదార్దాలలో ఒకటి.
ఇన్ వివో (జంతు-ఆధారిత) అధ్యయనాలు బ్రోకలీ కాలేయంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుందని సూచించాయి. ఫ్యాటీ లివర్ కు కారణమయ్యే హానికరమైన కొవ్వులలో ఇవి ఒకటి. బ్రోకలీ వినియోగం వలన కాలేయ ఎంజైమ్‌లలో గణనీయమైన తగ్గుదల కూడా గుర్తించబడింది, తద్వారా ఇది దెబ్బతిన్న కాలేయ కణజాల మెరుగుదలను సూచిస్తుంది. అదనంగా, కాలేయ క్యాన్సర్ కణాల అభివృద్ధిని కూడా ఇది నిరోధిస్తుందని నివేదించబడింది.
బ్రోకలీ వినియోగం ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుదలలో మరియు కాలేయం మరియు మూత్రపిండాల పనితీరు మెరుగుదలతో ముడిపడి ఉందని మరొక అధ్యయనం ద్వారా తెలిసింది.
అదనంగా, క్యాబేజీ కుటుంబానికి చెందిన కూరగాయలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో మరియు ఊపిరితిత్తుల వాపును తగ్గించడంలో సానుకూల ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు ప్రతిపాదించబడింది.
బ్రోకలీని పచ్చిగా (సలాడ్లలో) తినవచ్చు లేదా వివిధ వంటకాల ద్వారా తినవచ్చును .
రక్త శుద్దీకరణ కోసం ఉసిరి
ఉసిరి ఒక తీపి మరియు పుల్లని పండు, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ ఇన్ఫలమేటరీ ఏజెంట్, అంటే ఇది వివిధ వ్యాధుల వల్ల కలిగే వాపును తగ్గిస్తుంది. ఇది కొవ్వు జీవక్రియను (ఫ్యాట్ మెటబాలిజంను) మెరుగుపరచడంతో పాటు మందులు మరియు రసాయనాల వల్ల కలిగే కాలేయ టాక్సిసిటీని కూడా తగ్గిస్తుంది. అదనంగా, ఉసిరి ఒక ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్‌ను నిర్ములిస్తుంది మరియు అవయవ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఉసిరి యాంటీమైక్రోబయల్ సమ్మేళనాల యొక్క గొప్ప మూలం, ఇది రక్తం నుండి వ్యాధికారక బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
ఈ ప్రయోజనాలను పొందటానికి, ఉసిరిని పచ్చిగా తినవచ్చు లేదా ఉసిరి రసం లేదా పచ్చడి రూపంలో తీసుకోవచ్చు.
రక్తాన్ని శుద్ధి చేయడానికి మూలికలు మరియు మసాలాదినుసులు