![]() |
STORY 01 || PRUDHVIINFO |
ఏది న్యాయం
రాజు ఒక ఊళ్ళో ఒక మేకలు మేపేవాడు ఉండేవాడు. వాడు ఒక రోజు మేకలు తోలుకొని అడవికి వెళ్ళాడు. మేకలను అడవిలో వదిలేసి చెట్టుపై ఎక్కి నిద్రపోయాడు. సాయంత్రం లేచి చూశాడు. మేకలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు, మిగిలిన మేకలను తోలుకుని ఇంటికి వెళ్తాడు.
ఉదయం లేచి మళ్ళీ మేకలను అడవికి తీసుకొని వెళ్ళాడు. మేకలను అడవిలో వదిలివేసి, చెట్టుపైన నిద్రపోయాడు. సాయంత్రం లేచి చూసాడు. తన మేకలు సగం ఆశ్చర్యపోయాడు. మిగిలిన మేకలను తీసుకొని వెళ్ళాడు, ఉదయం లేచి మేకలను తీసుకొని మళ్ళీ అడవికి వెళ్లాడు, మేకలను వదిలివేసి చెట్టు పైన ఎక్కి చూస్తూ ఉన్నాడు. ఒక పులి వచ్చి ఆ మేకలను తింటోంది. అప్పుడు పిల్లవాడు కత్తితో చెట్టుకొమ్మను నరికి పులిపైన వేశాడు. పులి భయపడి పారిపోయింది. మేకలను తోలుకొని ఇంటికి వెళ్లి మేకలను కట్టివేసి ఊర్లోకి వెళ్ళి గ్రామస్తులకు చెప్పాడు. ఒక ఉపాయం వాడికి చెప్పారు గ్రామస్తులు
ఊరి బయట ఒక చిన్న ఇల్లు కట్టించి దానిలో రెండు మేకలను ఉంచారు. వాటి కోసం పులి వచ్చి ఆ ఇంటిలోకి వెళ్ళింది. తలుపులు వేసేసారు. మేకలు మేపేవాడు. గ్రామస్తులు సుఖంగా వున్నారు
ఒక రోజు పులి ఉండే ఇంటివైపు ఒక ముసలితాత వెళ్తుండడం చూసి పులి నిలిచింది. తాత వచ్చాడు. 'నన్ను విడిపిస్తే నిన్ను తినను ఊరిని విడిచి వెళ్తాను' అనింది. సరే నిన్ను విడిపిస్తాను నన్ను తినకూడదు" అంటాడు తాత. తాత పులిని విడిపించాడు. పలి బయటకు వచ్చి "తాతా నిన్ను తింటాను" అంది. అప్పుడు తాత “పులీ! నన్ను తీనను అన్నావు కదా! మరి ఇప్పుడు తింటానంటావే? సరే న్యాయం కోసం చెట్టు దగ్గరికి వెళ్దాం" అన్నాడు. "చెట్టూ! చెట్టూ! పులి బోనులో ఉంది. విడిపించాను. ఇప్పుడు నన్నే తినేయాలంటోంది. ఇది న్యాయమా? అన్నాడు. "న్యాయమే! ఎందుకంటే నేను మీకు పండ్లు, పూలు, కాయలు ఇస్తాను. మీరు నన్ను నరికి పొయ్యిలో పెడతారు. కాబట్టి న్యాయమే" అంది చెట్టు
సరే! చెరువు దగ్గరకు వెళ్దాం" అన్నాడు తాత. "చెరువా! చెరువా! పులిబోనులో ఉంది. దానిని విడిపించాను. ఇప్పుడు అది నన్ను తినేస్తానంటోంది. ఇది న్యాయమేనా?" అన్నాడు. "న్యాయమే! ఎందుకంటే నేను మీకు నీళ్ళు ఇస్తాను, నా నీళ్ళతో బట్టలు ఉతుక్కుంటారు, నా నీళ్ళతో స్నానం చేస్తారు. అయినా చెత్తంతా నా మూతి మీదే కొడతారు. కాబట్టి న్యాయమే" అంది చెరువు.
సరే! ఇప్పుడు బర్రె దగ్గరకు వెళ్లాం' అన్నాడు తాత. బర్రెతో “పులి బోనులో ఉంది. పులిని విడిపించాను. ఇప్పుడు నన్నే తినేయాలంటోంది, న్యాయమేనా?" అన్నాడు "న్యాయమే ఎందుకంటే నేను మీకు పాలు ఇస్తాను. నా పాలతో వెన్న, జున్ను, నెయ్యి పెరుగు చేసుకొంటారు. నేను పాలు ఇవ్వకపోతే ఎండుగడ్డి కూడా వెయ్యరు. కాబట్టి న్యాయమే" అంది. పులి సరే నీవు చెప్పినవాటి దగ్గరకు వెళ్ళాం. అవి న్యాయం చెప్పాయి బోను దగ్గరకు వెళ్లాం. అక్కడ నిన్ను తింటాను' అంది
తాత, పులి దారిలో వెళ్తుండగా ఒక నక్క కన్పించింది. "నక్కా! నక్కా! పులి బోనులో ఉంది. విడిపించాను. ఇప్పుడు నన్నే తినేయాలంటోంది. న్యాయమా అని అడిగాడు. "పులి బోనులో ఉండిందా. ఇంత చిన్న బోనులో పెద్దపులి ఉండిందా! నేను నమ్మను. సరే నాకు ఆ బోను చూపించు. పులీ! నీవు బోనులోకి వెళ్ళు చూద్దాం". అంది నక్క పులి బోనులోకి వెళ్ళింది, నక్క తలుపులు వేసేసింది. "తాతా నీవు ఎప్పుడూ ఇటువైపు రాకు" అని చెప్పి నక్క వెళ్ళిపోయింది