-->

అద్భుత కట్టడం .. లోటస్ టెంపుల్ || LOTUS TEMPLE DELHI || DO YOU KNOW || PRUDHVIINFO

 అద్భుత కట్టడం .. లోటస్ టెంపుల్

 ఢిల్లీలో తాజ్ మహల్ ని చూసిన పర్యాటకులు తప్పకుండా లోటస్ టెంపుల్ ని చూడకుండా ఉండరు. మరీ దీని విశేషాలు తెలుసుకుందామా?

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించిన కట్టడాల్లో ఢిల్లీలోని లోటస్ టెంపుల్ ఒకటి. అద్భుత పాలరాతి కట్టడంగా ఇది గిన్నిస్ పుస్తకంలోకి కూడా ఎక్కింది. పెద్ద కలువ పువ్వులా కనిపించే ఈ ఆలయం ఎత్తు 131 అడుగులు! అంటే దాదాపు పన్నెండు అంతస్తుల భవనమంత అన్నమాట!  ఏటా 40 లక్షల మంది, రోజుకి 13 వేలమంది, నిముషానికి 9 మంది దీన్ని చూస్తున్నారని  అంచనా. 


LOTUS TEMPLE DELHI


   ఇప్పటివరకూ దీన్ని ఏకంగా 7 కోట్ల  మంది సందర్శించారు. దీన్ని నిర్మించి 35  సంవత్సరాలు అవుతుంది. ఉత్తర అమెరికా ఇంజినీరింగ్ సంఘం దీనిని  20వ శతాబ్దపు తాజ్ మహల్ గా పేర్కొంది.  తాజ్ మహల్ లాగే దీన్ని కూడా పాలరాతితోనే  కట్టారు. ఇందుకోసం గ్రీస్ నుంచి ప్రత్యేకంగా  పాలరాయిని దిగుమతి చేసుకున్నారు. మొత్తం  27 రేకులతో కూడిన కలువ ఆకారంలో కట్టిన ఇది  చుట్టూ ఏర్పరిచిన జలాశయాల మధ్య నీటిలో తేలియాడుతున్నట్టు ఎంలో అందంగా కనిపిస్తుంది. మొత్తం 26 ఎకరాల స్థలంలో తీర్చిదిద్దిన దీని నిర్మాణం ఆరేళ్లపాటు కొనసాగి 1986లో పూర్తయింది.

     తొమ్మిది ద్వారాలతో కనిపించే ఈ ఆలయం లోపల 2500 మంది కూర్చోగలిగినంత విశాలమైన ధ్యానమందిరం ఉంటుంది. దీన్ని నిర్మించిన ఇరానీ శిల్పకారుడు ఫరీబోజ్ సహ దేశదేశాల్లో ఎన్నో పురస్కారాలు పొందిన ప్రఖ్యాత శిల్పకారుడు. ప్రపంచ దేశాలన్నీ దీని నిర్మాణాన్ని అపురూపమైనదిగా గుర్తించాయి. ఈ ఆలయంలో ఏ దేవుడి విగ్రహమూ ఉండదు.


 అద్భుత కట్టడం .. లోటస్ టెంపుల్ || LOTUS TEMPLE DELHI || DO YOU KNOW || PRUDHVIINFO



PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT