-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

విజయం అంటే ఏమిటి | life skills | prudhviinfo

 విజయం అంటే ఏమిటి ? 


అపుడు పద్మిని ఏమన్నది ? ...


మన దేశం నుండీ ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ లో విద్యార్థులతో మాట్లాడుతూ '' విజయం అంటే ఏమిటి? '' అని అడిగితే ఒక యువతి '' విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం , '' అనింది. అపుడు ఆ ప్రొఫెసర్ '' అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవుంతుడు ఎవరో చెప్పండి? '' అంటే ఎవరూ చెప్పలేదు. [ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి] బ్ర్తతకడానికి కొంత డబ్బు కావాలి కానీ , డబ్బే బ్రతుకు కాదు. అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట. మరో యువకుడు లేచి '' విజయం అంటే బలం / శక్తి '' అన్నాడు. అలా అయితే అలెగ్జాండర్ , నెపోలియన్ ,ముస్సొలిని ,హిట్లర్ , స్టాలిన్ , బిన్ లాదెన్ ... వీళ్ళంతా బలవంతులు , ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా , వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా ? వీళ్ళ జీవితాలు ఎలా గడిచి , ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా ! తన బలంతో , తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్ , తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే విజయమంటే బలం / శక్తి సంపాదన కాదు అన్నమాట. 



మరో యువతి '' విజయమంటే ప్రఖ్యాతి , అందం ,'' అనింది. అయితే కేట్ మోస్ , జీన్ ష్రింప్టన్ , సోఫియాలారెన్ , మార్లిన్ మన్రో ...లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు. భారత్ విషయానికొస్తే , పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే , అమితాబ్ బచ్చన్ తో సహా , ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ , మహేష్ భట్ లతో ఆమె ప్రేమ , పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర , రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ .. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి , నమ్మిన వాళ్ళు మోసం చేస్తే , తాగుడుకు బానిస అయ్యి , ఒక దశలో కాలికి కురుపు లేచి , అది ఒళ్ళంతా ప్రాకి , ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో , అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే , ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని , జనం ఆమెను తాళ్ళతో కట్టి , ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే , కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు. అయితే అందం , ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట .   

మరోసారి మరొకరు '' విజయమంటే అధికారం '' అని అన్నారు. అయితే '' కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి '' అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు. మా అనంతపురంలో ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి , పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట. 

చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు - '' విజయం అంటే ఏమిటి ? '' అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు , '' మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా ? '' అందరూ '' తెలుసు '' అన్నారు. '' వాళ్ళ అవ్వ , తాతల పేర్లు తెలుసా ? ''అని అడిగితే అయిదారుమంది ''తెలుసు '' అన్నారు. '' వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా ? '' '' తెలియదు '' అన్నారు. అపుడు ప్రొఫెసర్ గారు '' శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుద్ధుడు , ఆదిశంకరుడు , తెలుసా ? '' అందరూ '' ఓ , తెలుసు '' అని ముక్తకంఠం తో బదులిచ్చారు. '' మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు ? '' అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి , ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అనింది : '' సార్ , మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం , రాముడు , కృష్ణుడు , బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే : ' తమ కోసం , తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది , ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే ! '' 

'' నా గురించి నేను దు:ఖించకపోవడమే నా ఆనందానికి కారణం '' అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట , '' ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు , అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క '' [ Only they live who live for others , the others are more dead than alive] అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే కదా ?