![]() |
Indian currency unknown facts |
ఇండియన్ కరెన్సీ (Indian Currency) గురించి ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు:
1. ఒక పది రూపాయల నాణెం తయారు చేయడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 6 రూపాయల 10 పైసలు.
2. రూపాయి నోటు మరియు రూపాయి నాణేలను తప్ప మిగతా ఇండియన్ కరెన్సీ నోట్లు అన్నిటినీ (RBI)ఆర్బిఐ నే ముద్రిస్తుంది. రూపాయి నోట్లు మరియు రూపాయి నాణేలను మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ముద్రిస్తుంది.
3. ప్రస్తుతం చలామణీలో ఉన్న ఇండియన్ కరెన్సీ నోట్ల యొక్క సిరీస్ ని మహాత్మా గాంధీ సిరీస్ అని అంటాం.పేరుకి తగ్గట్టుగా అన్ని నోట్ల మీదా మహాత్మా గాంధీ బొమ్మ ఉండటమే ఈ సిరీస్ యొక్క ప్రత్యేకత. ఈ సిరీస్ 1996 నుండి చలామణీలో ఉంది.అయితే 1996 కి ముందు ‘లయన్ కాపిటల్ సిరీస్’ నోట్లని ఉపయోగించేవారు. ఈ నోట్ల మీద ప్రస్తతం రూపాయి నాణెం మీద ఉన్నట్టుగా మూడు సింహాలు కలిగిన సింబల్ ఉండేది.
4. మీకు తెలుసా! ఇండియన్ కరెన్సీ నోట్లని ప్రత్యేకమైన రంగులు, పత్తి మరియు బాల్సమ్ కలిగిన గుజ్జుతో తయారుచేస్తారు. ఇవి నోట్లను త్వరగా చిరగకుండా,అరిగిపోకుండా నిరోధించడానికి మరియు ఎక్కువ కాలం మన్నడానికి సహకరిస్తాయి.
5. మీరు ఏదైనా కరెన్సీ నోటుని కనుక స్పష్టంగా గమనించినట్టయితే నోటుకి ముందు భాగంలో దాని యొక్క విలువ(TEN RUPEES) ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో లిఖించబడి ఉంటుంది. నోటుకి వెనుకభాగంలో దాని విలువ 15 భాషలు అయిన అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణీ, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృత, తమిళం, తెలుగు మరియు ఉర్దూ.. ఇలా భారతదేశంలోని అన్ని భాషలవారికి అర్థమయ్యేలా 15 భాషలలో లిఖించబడి ఉంటుంది.
6. మీకు తెలుసా! మన ఇండియాలో జీరో నోట్లు కూడా చలామణీలో ఉన్నాయి.
జీరో రూపాయి నోట్ అంటే ఏమిటి?||WHAT IS ZERO RUPEE NOTE?||PRUDHVIINFO: https://www.prudhviinfo.com/2021/03/Zero-rupee-note.html