-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

కలకాలం నిలిచే చదువు

 

కలకాలం నిలిచే చదువు:-

ఎవరు రాశారో తెలియదు గాని అద్భుతం గా వుంది..ఆ రచయితకు వందనాలు.. 

సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న అజ్ఞాత రచయిత రచన మీ కోసం పట్టుకొచ్చా.. చదవండి.

>అమ్మ చేసిన రొట్టె వృత్తము

>సగానికి మడిచిన దోసె అర్ధ వృత్తము

>మనం కూర్చునే స్టూల్ చతురస్త్రం

>పడుకునే మంచం దీర్ఘ చతురస్త్రం

>మనకిష్టమైన లడ్డూఒక గోళము

>సగం లడ్డూ మన మిత్రునికిస్తే అర్ధ గోళము

>మన తరగతి గది ఒక ఘనం

>మనం కూర్చునే బెంచీ ఒక దీర్ఘ ఘనం

>మన జెండా కర్ర ఒక స్థూపం

>కొడవలి మలుపు ఒక చాపం

>ధాన్యపు రాశి ఒక శంఖువు

>రూపాయి రూపాయి కలిపితే కూడిక

>కొనడానికి కొంత తీస్తే తీసివేత

>తలా పది పంచితే భాగహారం

>హెచ్చిస్తే గుణకారం

>కూర్చుంటే జడత్వం

>కదిలితే చలనం

>పరిగెత్తితే వేగం

>ఆగి ఆగి పరుగు తీస్తే త్వరణం

>పడిపోతే ఆకర్షణ

>విడిపోతే వికర్షణ

>తన చుట్టూ తాను తిరిగితే భ్రమణం

>గుడి చుట్టూ తిరిగితే పరిభ్రమణం

>మాట్లాడడానికి శక్తి

>పనిచేయడానికి బలం

>గంటకు ఎంతపని చేస్తావో అది సామర్థ్యం

>వింటున్నా మంటే శబ్దం

>చూస్తున్నామంటే వెలుగు

>రంగులన్ని వర్ణ పటం

>ఆహారం అరగడం జీవక్రియ

>అరిగిన ఆహారం శక్తిగా మారడం రసాయన క్రియ

>ఉచ్వాస నిశ్వాసాలు శ్వాస క్రియ

>నేను చూశాను భూతకాలం

>నేను చూస్తున్నా వర్ధమాన కాలం

>నేను చూడ బోతున్నా భవిష్యత్ కాలం

>నాకు తొంభై ఏళ్ళు ఇక పోయే కాలం

బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..

సరిగా అర్థం చేసుకుంటే మన బతుకే ఒక శాస్త్రం...

మనిషిని, ఇతర ప్రాణుల్ని , ప్రకృతిని గురించి తెలుసుకోవడం తప్ప.

భయమెందుకు నీకు ...

నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప...

తెలుసుకో పదిలంగా

నేర్చుకో సులభంగా...!   

అదే మన తెలుగు భాష గొప్పదనం.  

భలే ఉంది కదా మరి ఆలస్యం ఎందుకు మిత్రులతో పంచుకోండి