గులాబి రంగు మారింది || entry no 2 || prudhviinfo
60 సంవత్సరాల అతను ఎంతో ప్రేమతో వాటిని పెంచుతున్నాడు వాటిని కపౌడుకుంటున్నడు .

- అది అతని 24 ఏట , పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం రాగానే అందుకున్న మొదటి జీతంలో కొంత వృద్ధాశ్రమం కోసం ఇవ్వాలి అని ఆశ్రమానికి వచ్చాడు. అక్కడే ఉన్న వృద్ధుల బాగోగులు చూసుకుంటున్న 21 ఏళ్ల అమ్మాయిని చూసాడు.
- ఆమె కళ్ళలోని నయనం ఎంతో ప్రభావితం
ఆమె మొహంలోని సౌందర్యం పసిపిల్లల అమైకత్వం ఆమె మాట సునితత్వం
ఆమె మనసు నిండా మాతృత్వం
- తనలనే ఆమె కూడ తల్లితండ్రులను చిన్న వయసులోనే కోలిపోయింది అని తెలుసుకున్నాడు.
- ఆమెను వివాహమాడి జీవితం గడపగల్గితే అదే ఈ జీవితానికి అర్థాన్ని ఇస్తుంది అనుకున్నాడు. పక్కవూర్లో ఉద్యోగం చేస్తు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండే మనవడికి ఉత్తరాన్ని రాసి పంపడమే మెలనిపించింది.
- ఉత్తరాలు రాస్తున్నాడు రాస్తున్నాడు అక్కడ అమ్మాయి చదువుతుందో లేదో తెలీదు . ఇతను మాత్రం ప్రేమ కవిగా మారిపోయాడు. తన స్పందన కోసం ఎంత కాలం ఎదురు చూసిన తప్పు లేదు ఎందుకంటే తను అంత విలువైనది అంటుంటాడు.
- ఆరోగ్యం బాగోక ఆఫీసుకి వెళ్ళలేకపోయాడు 3 రోజులు . ఎలాంటి ఉత్తరాలు 3 రోజుల నుండి రాకపోవటంతో ఆమె ఎదో కొలితున్నట్టు భావించింది. తిరిగి ఉత్తరం రాయాలి అంటే అతను ఇంతవరకు తన పేరు ఊరూ ఎది అడ్రస్లో పరిచయములో రాయలేదు. పోస్ట్ ఆఫీసులో పని చేస్తున్న అతని సహాయంతో అయిన అహ్ ఉత్తరాన్ని అతనికి చెరవేయగలనేమో అని పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళింది అక్కడ అతను లేకపోవడంతో అతని ఇంటికి వచ్చింది. అతను అప్పటికే హాస్పిటల్ కి వెళ్ళడంతో మూసి ఉన్న తలుపు చెక్కల మధ్య ఉత్తరానికి ఇంకో కాగితాన్ని జోడించి పెట్టింది.
- అతను రాగానే చదివి ఆశ్చర్య పోయాడు. ఆ ఉత్తరంలో ఆమె అతన్ని ప్రేమిస్తుంది అని అతని ఓపిక నిజాయతీ చూడడానికి బదులుగా ఉత్తరాలు రాయలేదు అని తెలిపింది. ఇంకో కాగితం పై ఇలా రాసింది. దయచేసి ఎలాగైనా ఈ ఉత్తరం అతనికి చేరేల చూడండి. మీ ఆఫీస్ నుండే ఎప్పుడు అతను పంప్తున్నడు . అతని పేరు ఊరూ ఇవేం నాకు తెలీదు . అతను లేఖతో పాటు పసులు గులాబీ రెక్కలు పంపడం మాత్రం చెప్పగలను అని రాసింది.
- ఆమెకు అతను నేనే అనే నిజం చెప్పడానికి బయల్దేరాడు . ఆరోగ్యం బాలేని స్థితిలో వెళ్తున్న అతనికి మైకం కమ్ముకున్న కనులకు దారి కనిపించక అటుగా వెళ్తున్న వాహనానికి అడ్డంగా పడిపోవడంతో తన ఒక కాలిని కోల్పోయాడు.
- హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు. అక్కడ ఆమె ఎదుర్చూస్తు అలసిపోతుంది. ఇక్కడ ఇతను తన అవిటి కాళ్ళతో తనని చేరి తన జీవితానికి మచ్చగా మిగిలి పోవద్దు అని ఉత్తరాల పాటకు సెలవు పెట్టాడు. ఆమె చేసేది ఏమి లేక అక్కడే అదే పని చేస్తూ వివాహాం చేస్కోకుంట ఉండిపోయింది.
- నిజాన్ని దాచుతు ఆమె వద్దకు వీలైనంత తక్కువ సార్లు వెళ్ళేవాడు . వెళ్ళిన ప్రతి సారి మీరు పెళ్లి చేసుకోవచ్చు ఒక తోడు ఉంటుంది అని సలహా ఇచ్చేవాడు. ఆమె బదులుగా చిన్న నవ్వు నవ్వుతూ. నాకు మరల ప్రేమించే మగవారిని నమ్మే అంతా దైర్యం లేదండి అనేది. అతను ఏ బదులు చెప్పలేక మౌనంగా వెళ్ళిపోయేవాడు.
- కాలం గడిచింది. అతని 60 వ ఏట ఆరోగ్యం దెబ్బ తింటుంది . చనిపోతనేమో అనే బుగులు అతనిలో ఉంది. చనిపోయే ముందు ఆమెతో చెప్పాలి అనుకున్నది చెప్పాలి అని అనుకున్నాడు . ఫిబ్రవరి 7 - రోజు పువ్వు రోజు , ప్రేమకు చిహ్నంగా ఇచ్చే గులాబీ ఒక్కసారైనా ఆమెకు ఇవ్వాలి అని ఆశతో తన తోటలో ప్రేమగా పెంచుతున్నాడు కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు . రేపు ఫెబ్రుఅరీ 7 , తన తోటలోని రోజాలని పడుకునేముందు ఓసారి చూసి పడుకున్నాడు. రాత్రంతా బారి గాలులు వీచడంతో గులాబీ రెక్కలు అన్ని నెల రాలిపోయి ఉన్నాయి. అతను అహ్ దృశ్యాన్ని చూసి చాలా బాధపడ్డాడు . ఏది ఎం అయిన తనకు రోజా పువ్వు ఇవ్వాలని పువ్వుల కొట్టుకు కుంటుకుంటూ మెల్లగా వెళ్ళాడు. తలుపులు వేయడమే మర్చిపోయి వెళ్తున్నాడు.
- రోజా పువ్వు తీసుకొని ఆమె వద్దకు వెళ్తున్నాడు . ఒక వైపు బాగా గాలి వీస్తుంది. అహ్ గాలికి రాలి పడి ఉన్న గులాబీ రెక్కలు అహ్ చుట్టుపక్కల అంత గాలిలొ కనిపించాయి.
- గాలిలొ గులాబీ రెక్కలు కనిపించడంతో గులాబీ రెక్కల వాన పడ్తుంది అని ఒకరు అన్న మాట ఊరంతా తెలిసింది. చూడడానికి ఎంతో మంది వచ్చారు. ఆమె కూడా వచ్చింది.
- ఆశ్రమంలో ఆమె లేకపోవడంతో నిరాశతో ఇంటికి చేరుకుంటున్న అతనికి ఎంతో మంది గుమ్మికుడడం కనిపించింది. అహ్ దృశ్యాన్ని చూసి అందరూ వెళ్ళిపోయారు ఆమె మాత్రం అక్కడే ఉండిపోయింది. అతని దగ్గరికి వచ్చి ఎదురుగా నిల్చొని కన్నీళ్లు పెట్టుకుంది.
- నువ్వు నన్ను అంత నిజాయతీగా ప్రేముంచినపడు నేను మాత్రం నీలోని లోపాన్ని చూసి తిరిగి ప్రేమించ లేను అని ఎలా అనుకున్నవు ? అతను ఎలా తెలిసింది అనే ఆశ్చర్యం లోనే ఉన్నాడు. గాలిలొ ఎగురుతున్న అహ్ పసుపు రంగు గులాబీ రెక్కలు నా గతాన్ని గుర్తుకుచేశయి . ఎదో అనుమానంతో ఇంటిలోకి వెళ్ళాను అక్కడ నా ఫోటో చూసి అనుమానం ఇంకా పెరిగి నిన్ను పిలిచాను ఎంత పిలిచిన రాకపోవటంతో ఇల్లంతా వెతికాను నీకోసం కాదు ఇంకా ఏమయినా దొరుకుతాయి అని . ఈ డైరీ దొరికింది చదివేశాను. మళ్లీ గతంలో నీ ఉత్తరాలు చదివినంత ఆనందం కలిగింది . నువ్వు నన్ను ఇంతగా ప్రేమించావ ?
- ఎది ఎం అయిన నువ్వు అప్పుడే చెప్పేయల్సింది. అప్పుడే చెప్పి ఉంటే ఇప్పటికీ 35 ఏళ్ల జీవితం ఎంత బాగా గడిపేవాళ్ళం. సరేలే కాలాన్ని వెనక్కు వెళ్లి మార్చలేం కదా
- అవును తలుపులు తెరిచి ఈ వాతావరణంలో బయటికి ఎక్కడికి పోయావు ? అతను దించుకున్న తలను లేపుతు తన కోటులోనుంచి ఎర్ర గులాబీ ఇచ్చాడు.
- ఆమె : గులాబీ రంగు మారిందే ?
- అతను: పసుపు గులాబీ నమ్మకాన్ని ఇది ప్రేమను తెలపడానికి .ఆమె : నమ్మకాన్ని ఇచ్చి వెళ్లవ్ . ప్రేమను ఇవ్వడానికి ఇన్నాళ్లు పట్టింది .అతను: మౌనంగా ఉన్నాడుఆమె : అతని చేయిని తన చేతిలోకి తీసుకొని ముద్దుపెడుతుంది.
------------------^ ^------------------
---------------- End ------------------
- vamshikrishnamedaram