ఔషధాలు గోధుమరంగు సీసాల్లో భద్రపరుస్తారు ఎందువల్ల?
ఔషధ సిరస్టు సాధారణంగా గోధుమరంగు సీసాల్లో లభిస్తాయి.
ఈ ఔషధాలు రసాయన సమ్మేళనాలు. ఈ మందుపై సూర్య కాంతి పడితే అందలి అతినీల లోహిత కిరణాల ప్రభావానికి ఈ
రసాయన సమ్మేళనాలు విఘటనం చెందుతాయి. ఫలితంగా ఔషధం పనికిరాకుండా లేదా ప్రమాదకరంగా తయారుకావచ్చు.
ఈ ఔషధాలను రంగుసీసాల్లో భద్ర పరుస్తారు. ముఖ్యంగా గోధుమ రంగు సీసాగుండా ఎక్కువ సూర్యకాంతి లోపలకు చొచ్చుకుపోదు. అందుకే గోధుమరంగు సీసాలు వాడుతారు.