దేహ భావన వదలి పెట్టండి!
+++++++++++++++++++++++
మానవులు దుఃఖాలు, బాధలు, రోగాలు,సమస్యలతోసతమత
మవ్వటానికి కారణం దేహ భావనతో జీవించడమే. దేహ భావన ఉన్నంత సేపూ ఇది తప్పవు. అంతే కాకుండా ప్రతీ మానవుడు ఆత్మ స్వరూపుడు, ఆత్మ అంటే భగవంతుడు. భగవంతుని స్వరూపమై ఉండి కూడా దేహం ధరించడం వలన దేహభావనతో జీవించడం వల్ల మానవుణ్ణి అనుకుంటూ దేహ సంబంధమైన బాధలు అనుభవిస్తున్నాడు. కానీ మానవుడు ఎప్పుడైతే దేహ భావన వీడి దైవ భావనలో జీవిస్తాడో, దేహ సంబంధమైన బాధల నుండి, దుఃఖాల నుండి విముక్తి చెందుతాడు. మరి దైవ భావనలో జీవించాలంటే "దేహ భావన వదలవలసిందే. అందుకే సత్య సాయిబాబా దేహ భావన వదిలితే దైవ భావన కలుగుతుందని" అన్నారు. మరి మానవులకు దేహ భావన పోవాలంటే ఒక్కటే మార్గం.
ధ్యానం ఎవరైతే పట్టుదలగా చేస్తారో వారిలో కొన్నాళ్ళకుదేహబావం పోతుంది. మెల్లమెల్లగా వారిలో దైవ భావం పెరుగుతూ ఉంటుంది. అంటే ఏ మానవుడైనా సరే ధ్యానం చేస్తే. మాధవుడుగా మారతాడు. సమస్త దుఃఖాల నుండి శాశ్వతంగా దూరమౌతాడు. ఈ సాధన చేస్తున్న వారు దేహ భావనతో ఉన్నారా? లేక దేహ భావన తొలగించుకున్నారా? ఏ స్థితిలో ఉన్నారు? అని తెలుసుకోవటానికి దేహ భావనకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఆ రకమైన స్థితిలో మీరు ఉంటే ఇంకా దేహ భావనలో ఉన్నట్టే. అంటే మీరు ధ్యాన సాధన ఇంకా పెంచాలి. ఎక్కువ సేపు చేయాలి అని తెలుసుకొండి. అలా మీ సాధన తీవ్రతరం చేసినట్లయితే మీరు అన్ని విషయాలలో దేహభావనతొలగించుకోగలుగుతారు. ఆత్మ భావనతో జీవించగలుగుతారు. పరమాత్మలౌతారు.