***************************
తేనె (HONEY) తో లాభాలు
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేనె (Honey) : దీనిని మధువు, పుష్పరసం, మకరందం అని అంటారు. పూలనుబట్టి, తేటీగలను బట్టి అనేకరకాల తేనెలుంటాయి. పట్టు తేనె, పుట్ట తేనె, పెట్టె తేనె చేసింది. తొర్రతేనె అని కూడా ఇందులో రకాలున్నాయి. ఆయా ప్రాంతాలలో పూలుపూసే చెట్లను బట్టి తేనె గుణాలుంటాయి.
👉వేపపూలనుండి సేకరించబడిన తేనె చిరుచేదుగ ఉండి, పైత్యశాంతి, మేహశాంతి. చేస్తుంది.
👉చింతపూల తేనె వేడిచేసి, వాతాన్ని హరిస్తుంది.
👉గానుగపూల తేనె త్రిదోషహరంగా వుంటుంది. అడవిపూల తేనె కూడా త్రిదోషహరం. కాచిన తేనెను మాత్రమే ఉపయోగించాలి. తేనెను కాయకపోతే మైనం వంటి అనేక మలినాలు అందులో మిగిలివుండి, స్వచ్ఛంగా వుండదు, నిలువ ఉండదు
👉సాధారణంగా తేనె తీపిగానూ, కొంచెం పులుపు ఛాయ కలిగిన రుచిని కల్గివుంటుంది. వేడి చేసి ఆర్చుతుంది. త్రిదోషహరం (కఫ, వాత, పిత్తాలు) బలకారి, విరేచనకారి. కడుపునొప్పి, వాంతికావడం, మూర్ఛ, క్రిమిరోగం, విషదోషాలు, దాహం, రక్తపైత్యం, కుష్టు, ఊపిరిగొట్టునొప్పి, వాతం, శ్లేష్మం, దగ్గు, వగర్పులు, మేహం, అతిసారం, శీతపైత్యం, కఫం, పక్షవాతం వంటి జబ్బులకు తేనె నివారిణిగా పనిచేస్తుంది.
![]() |
Honey benefits |
👉 నరాలకు మేలుచేసి, వాటిలోని చిక్కులను (Blockades) విప్పుతుంది. శరీరంలో పేరుకున్న విషపదార్థాలను విరుస్తుంది, బయటకు త్రోసివేస్తుంది. శరీరాన్ని శుద్ధిచేస్తుంది. మూత్రరోగాన్ని, నేత్రరోగాలను తగ్గిస్తుంది. మూత్రపుసంచిలోని (Bladder) రాళ్ళను కరిగిస్తుంది. పొట్టకు, హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. గాయాలను మాన్పుతుంది. బాగా వేడిచేస్తుంది కాబట్టి ఉష్ణశరీరులు కొంచెం
జాగ్రత్త వహించాలి.దీనికి విరుగుళ్ళు నెయ్యి, నీళ్ళు, దానిమ్మకాయ, నిమ్మకాయ, నారింజకాయధనియాలు.
👉 తేనే కొద్దిమోతాదులో విరేచనాల్ని కడుతుంది. అధికంగా తీసుకుంటే విరేచనం జారీ చేస్తుంది.
👉వేసవి కాలం ఉదయం పూట ఒక టేబుల్ స్పూను తేనెను అరకప్పు నీటిలో కలిపి తీసుకుంటే వడదెబ్బ తగలకుండా వుంటుంది. శీతకాలంలో కలుగజేస్తుంది.
👉పక్షవాతం వచ్చిన వెంటనే శ్రేష్టమైన తేనె 50ml చొప్పున రోజులో రెండ మూడు పర్యాయాలు తాగిస్తే పక్షవాతాన్ని నిలుపు చేస్తుంది, తగ్గిస్తుంది.
👉ఏ ఔషధమయినా తేనె అనుపానంతో తీసుకుంటే శరీరంలోకితర్వగాగ్రహించుకోబడుతుంది. అనారోగ్యం నుండి నివారణ కూడా తక్షణ మవుతుంది. ఔషధాన్ని శరీరం పీల్చుకోవడం అనే ప్రక్రియలో __మాధ్యమంగా (Catalyst) ప్రవర్తిస్తుంది. ఇందువలన ఔషధం శరీరంలో త్వరగానూ, సంపూర్ణంగానూ గ్రహించబడి నివారణ త్వరగా జరుగుతుంది.
👉రక్తానికి ఇది ఎంతో సహజమయిన టానిక్ వంటిది. శరీరానికి వెంటనే శక్తినిస్తుంది. పాలతో తేనె కలిపి తీసుకుంటే, శరీరంలో సహజంగా వుండే రోగనిరోధకశక్తి పెంపొంది, రోగాలను సమర్థంగా నిలువరించే శక్తి శరీరానికి ఏర్పడుతుంది. మనిషికి దీర్ఘాయువు ప్రసాదించగలిగే మంచి ఆహార పదార్థం ఇది.
👉. స్వచ్ఛమైన తేనె మూత వుంచిన శుభ్రమైన పొడి సీసాలలో భద్రపరచాలి. గాలికి మూత తెరచి వుంచకూడదు. గాలి తగిలితే తేనె పాడవుతుంది. మంచి
👉తేనెపంచదారలాగాస్ఫటికాలుగా మారుతుంది. సీసాను కొంత సేపు వేడిని పాత్రలో వుంచితే, ఆ స్ఫటికాలు కరిగి తేనగ మారుతాయి.
👉తేనె తేలికపాటి విరేచనకారి. మలబద్దం వున్నవారు ప్రతిదినం తేనె తీసుకుంటే మలబద్ధం నివారిస్తుంది.
👉తేనె శరీర అవయవాల పనితీరును చక్కగా నియంత్రిస్తుంది. అందువలన ఇది ఆరోగ్యాన్ని పెంపజేస్తుంది. టి.బి. పేషెంట్లకు, మధుమేహరోగులకు చాలా మంచి ఆహారం.
👉పాలలో తేనె కలిపితే అది పెరిగే పిల్లలకు ఎంతో బలవర్దక ఆహారం అవుతుంది
👉. నోటిలోని అల్సర్స్కు తేనె పుక్కిలిస్తే మంచిది. తేనె పూసి ఆరిన తరువాతకడిగివేస్తుంటే గజ్జి,y తామర వంటి చర్మవ్యాధులు నివారించబడతాయి.
👉 తేనె పుంస్త్వమును పెంపుచేస్తుంది. సంభోగంలో తృప్తినిస్తుంది. శీఘ్రస్ఖలనంనివారిస్తుంది సంభోగానంతరం ఏర్పడే అలసటను తొలగిస్తుంది.
👉 కీళ్ళు వాచి నొప్పిగా వున్నప్పుడు తేనెతో నిమ్మరసం కలిపి పూస్తే నొప్పి నెమ్మదిస్తుంది. కండరాల నొప్పులకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది.
👉కాలిన గాయాలకు తేనె పూస్తే బాధ ఉపశమిస్తుంది.
👉 అతిమూత్ర వ్యాధితో బాధపడుతున్నవారు రాత్రి పడుకోబోయే ముందు ఒక టేబుల్ స్పూను తేనె సేవిస్తే, ఇబ్బంది చాలావరకు తగ్గుతుంది.
👉 చంటిపిల్లల జలుబు, జ్వరాలకు ఏడెనిమిది తేనె చుక్కలను ఒక టీస్పూను తాజా తులసి ఆకుల రసంలో కలిపి తాగిస్తే నెమ్మదిస్తుంది. ఇలా రెండు రోజులపాటు మూడుపూటలా చేయాలి.
👉 బాగా పాత (నిలువవున్న) తేనె రోజూ ఉదయం ఒక టేబుల్ స్పూను సేవిస్తుంటే ఊబశరీరుల స్థూలతనం పోతుంది. నరాలలో శక్తి పుంజుకుంటుంది. మొద్దుతనం, బండతనం వారిని వదిలిపోతాయి.
ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ లో మరిన్ని హెల్త్ టిప్స్ చూడండి