![]() |
Why does it not rain in the deserts? |
ఎడారుల్లో వర్షాలు ఎందుకు పడవు?
వర్షాలు కురిసేది ఆకాశంలో ఏర్పడే మేఘాల వల్లే. భూమిపై ఒక ప్రాంతం ఉండే ఉన్నతాంశం ఆధారంగా ఎత్తు లేక లోతులపై అక్కడ కురిసే వర్షపాతం ఆధారపడి ఉంటుంది. నీటికి నిలయమైన నదులు, సరస్సులు, సముద్రాల నుంచి నీరు సూర్యరశ్మికి ఆవిరై భూఉపరితలం నుంచి పైకి వెళ్లి అక్కడ ఘనీభవించడంతో మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాలు వాతావరణ పీడనంలోని హెచ్చుతగ్గులు, గాలులు వీచే దిశలను బట్టి పయనించి చెట్లు, అరణ్యాలు ఉండే ప్రదేశాల్లో, వాతావరణంలో తగినంత తేమ ఉండే ప్రాంతాల్లో వర్షిస్తాయి. ఎడారులలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల చెట్లు, చేమలు లేకపోవడంతో అక్కడి గాలి పొడిగా ఉంటుంది.
ఆ ప్రాంతాలకు చేరుకున్న మేఘాలు కురవకుండానే ఆ ప్రాంతాలను దాటివెళ్తాయి. నీటి వనరులు ఏమీ లేకపోవడంతో, ఎడారులుండే ప్రాంతాల్లో మేఘాలు ఏర్పడే అవకాశం కూడా ఉండదు. అక్కడక్కడ ఉండే ఒయాసిస్సులలోని కొద్ది పాటి నీరు సూర్యరశ్మికి ఆవిరై, చిన్న చిన్న మేఘాలు ఏర్పడినా, అవి అక్కడి అధిక వేడితో ఆవిరైపోతాయి.
ఎడారులను ఆనుకొని సాధారణంగా పర్వతాలు ఉంటాయి. ఉదాహరణకు అతి పెద్దదైన సహారా ఎడారిని ఆనుకొని పర్వత శ్రేణులు ఉన్నాయి. నీరు, మంచు ముక్కలను మోసుకొస్తున్న మేఘాలను అడ్డుకోవడంతో ఆ పర్వతాలకు ఒక వైపున వర్షాలు ఎక్కువగాకురుస్తాయి. ఆ పర్వతాలకు మరోవైపున వర్షాలు ఏమాత్రం కురవక పోవడంతో ఆ ప్రాంతం ఎడారిగా మారింది. భూమిపై ఉండే ఎడారులన్నీ ఇలా ఏర్పడినవే. ఎడారుల్లో అప్పుడప్పుడూ కొన్ని నీటి జల్లులు పడతాయి.
ఎడారుల్లో వర్షాలు ఎందుకు పడవు? || Why does it not rain in the deserts? || prudhviinfo