![]() |
జీవితంలో విలువలు
++++++++++++++++++++++
జీవితంలో విలువలు ముఖ్యం, ప్రేమ, సత్యం, ధర్మం, శాంతి, అహింస ముఖ్యమైన విలువలు ఒక్కరూ గొప్పవారు అవ్వచ్చు. కాలేక పోవచ్చు. అనుకున్నంతగా పేరు ప్రఖ్యాతులు, అధికారం, ధనం పొందవచ్చు. పొందలేకపోవచ్చు. కానీ, మంచివారు అవ్వటానికి మాత్రం తప్పకుండా కృషి చేయాలి. నిజాయితీతో, నిబద్ధతతో ప్రయత్నించాలి. పది మందికి ఉపయోగపడే పనులు, పరమాత్మ మెచ్చే పనులని గమనించాలి. హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. ఆలోచనల్లో స్పష్టత కలిగి ఉండాలి. మాటల్లో ఆత్మీయత, సూటి దనం, పొందికను సాధించాలి. మన చేతలు ఇతరులపైనే కాకుండా మన ఆలోచనలపై కూడా ప్రభావాన్ని కలిగి ఉంటాయి. విలువల గురించిన ధ్యాస మన శ్వాస కావాలి. జీవితం ఆనందమయం కావాలి. అందరి ఆనందానికి, అందరూ కృషి చేసి చక్కని వాతావరణాన్ని సృష్టించటంలో మన పాత్ర మనం మనస్ఫూర్తిగా పోషించాలి.
జీవితంలో విలువలు || Values in life || PRUDHVIINFO