![]() |
The time period measurement clock |
ప్రస్తుత కాలంలో మనం దశాంశ పద్ధతి (Decimal System)ని వాడుతున్నట్టే, బాబిలోనియన్లు 3000 సంవత్సరాల క్రితం షష్ఠిగుణక పద్ధతి (hexagesimal system) ని అనుసరించేవారు. ఈ పద్ధతిలో గణిత సంబంధిత సంఖ్యలన్నీ 6తో గుణించబడి ఉండాలి. ఆ ప్రకారం సంవత్సర కాలాన్ని 360 రోజులుగా, రోజును 24 గంటలుగా, రోజులోని గంటను 60 నిమిషాలుగా, నిమిషాన్ని 60 సెకన్లుగా, నెలను 30 రోజులుగా, సంవత్సరాన్ని 12 నెలలుగా విభజించారు. ఇవన్నీ 6 గుణకాలే. బాబిలోనియన్ల అంచనా ప్రకారం భూమి, గ్రహమండలం (zodiac) గుండా 360 రోజులు వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది.
అందువల్ల వృత్తాకారాన్ని 360 భాగాలుగా విభజించారు. ఒక్కో భాగం ఒక డిగ్రీ. అంటే భూమి గ్రహమండలంలో ఒక రోజుకు ఒక డిగ్రీ వంతున పరిభ్రమిస్తుంది. 60X6=360 కాబట్టి ఒక్కో డిగ్రీని 60 భాగాలుగా (ఒక్కో భాగం మినిటీ), ఒక మినిటు 60 భాగాలుగా (ఒక్కో భాగం సెకండు) విభజించారు. త్రికోణమితిలో తరచూ ఉపయోగించే కోణీయం రూపకాలైన డిగ్రీలన్నీ ఆరు గుణకాలే. ప్రాథమిక భౌతిక రాశు లైన పొడవు, ద్రవ్యరాశులు చాలా కాలం కిందటే దశాంశ పద్ధతి (మెట్రిక్)లోకి మార్పు చెందినా, ఇప్పటికీ కాలం (టైమ్) కొలతలు మాత్రం షష్ఠిగుణక పద్ధతిలోనే కొనసాగుతున్నాయి.
కాలం కొలతలు అప్పటివే || The time period measurement || prudhviinfo