![]() |
These bridges are for animals only |
ఈ వంతెనలు జంతువులకు మాత్రమే!
నగరాల్లో వాహనాలతో బిజీగా ఉండే రోడ్డు దాటడానికి వంతెన ఏర్పాటు చేయడం చూసుంటారు. కానీ జంతువులు రోడ్డు దాటడానికి వంతెనలు ఏర్పాటు చేయడం ఎక్కడైనా చూశారా?
అయితే ఇదిగో చూడండి. జంతువుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వంతెనల విశేషాలు. అడవుల గుండా రహదారులు ఉండటం సాధారణమే. అయితే జంతువులు రోడ్డు దాటే సమయంలో వేగంగా వచ్చే వాహనాలు ఢీకొట్టడం, జంతువులు మరణించడం జరుగుతుంది. ఆ ప్రమాదాలను నివారించడం కోసం అధికారులు జంతువుల కోసం వంతెనలు నిర్మించారు. సింగపూర్‌లో ఆరు వరుసల జాతీయ రహదారిని దాటడం కోసం వంతెన ఏర్పాటు చేశారు. ఆది చెట్లు, పొదలతో సహజసిద్ధంగా ఉంటుంది. జపాన్ లో కోబ్ పట్టణంలో ఉన్న సుమ ఆక్వాలైఫ్ పార్కులో రైల్వే అధికారులు తాబేళ్ల కోసం ఓ టన్నెల్ ఏర్పాటు చేశారు. తాబేళ్లు సురక్షితంగా రైల్వే లైను దాటడం కోసం ఈ టన్నెల్ నిర్మించారు. బ్రెజిల్ లోని బాహియాలో కోతుల కోసం రహదారి పైనుంచి తాళ్లతో వంతెన ఏర్పాటు చేశారు.
వాషింగ్టన్ లోని లాంగ్ వ్యూ పట్టణంలో ఉడుతల కోసం చిన్న వంతెన నిర్మించారు. తరచుగా రోడ్డుపై అటూ ఇటూ పరుగెడుతూ కార్ల కింద పడే అవకాశం ఉండటంతో వాటికోసం ఈ వంతెన ఏర్పాటు చేశారు. ప్రతీ ఏటా కొన్ని లక్షల పీతలు క్రిస్మస్ ఐలాండ్ నుంచి గుడ్లు పెట్టడం కోసం పసిఫిక్ మహాసముద్రం దగ్గరకు వలసపోతుంటాయి. వాటి కోసం ప్రత్యేకంగా ఓ వంతెన నిర్మించారు.
ఈ వంతెనలు జంతువులకు మాత్రమే! || These bridges are for animals only! || prudhviinfo