దేహ భావనకు కొన్నిఉదాహరణలు.
++++++++++++++++++++++++++++++++++++++++++++++
1. ఇంద్రియ సుఖాల మీద మమకారం ఉన్న వాడు అంటే తిండి మీద అంటే మధురమైన పదార్థాలు భుజించాలనే నా మీద కోరిక, సువాసనలంటే ఇష్టం ఉండటం, సుందరమైనవి చూడాలనే కాంక్ష మధురమై స్వరాలు వినాలనే కోరిక. ఇవన్నీ ఎన్ని సార్లు అనుభవించినా ఇంకా ఇంకా అనుభవించాలనే తపన వాటి మీద మమకారమే.
2. పైవన్నీ అనుభవించటానికి కావలసిన ధనం, భోగ భాగ్యాలు, అమలు, సంపదలు పొందాలనే సంపాదించాలనే
విపరీతమైన కోరిక వాటి మీద మమకారం ఉన్న వాడు దేహ భావనలో ఉన్నట్లే
3. అంతే కాకుండా పదవులు మీద పేరు ప్రఖ్యాతులు మీద మమకారం, అందరి కంటే అధికంగా ఉన్నతంగా జీవించాలనే వాటి మీద మమకారం ఉన్నవాడు దేహ భావనతో ఉన్న ట్లే
4. నేనే అందరి కంటే గొప్ప వాడిని కావాలి. గొప్ప వాడిగా జీవించాలి అని భావించేవాడు కూడా దేహ భావన ఉన్నట్లే
5. కుటుంబం మీద, బంధువల మీద ఎనలేని మమకారం ఉండటం దేహ భావనభావనలో ఉన్నట్టే
6. దేహం గురించి ఆలోచించే వాడు, దేహ బాధలు, దేహ సమస్యల గురించే ఆలోచిస్తూ వాటి కోసం సమయాన్ని ఆయుష్షును, శక్తిని వృధా చేసుకునే వారు దేహభావనలో ఉన్నట్టే
8. ఎన్ని అనుభవిస్తున్నా ఎన్నాళ్ళు అనుభవించినా ఇంకా ఇంకా అనుభవించాలనుకొనే వాడు దేహ భావనలో ఉన్నట్లే
9. దేహ సౌందర్యం చూసి, దేహ సౌష్టవం చూసి మురిసిపోయేవారు. వాటిని పోషించుకోవడం కోసం సమయాగ్నంగా " వ్యర్ధం చేసేవాడు దేవా భావనలో ఉన్నట్టే,
10. తన కోసమే కార, తన కుమారుల కోసం, మర్రివేల కోసం, ముని మనుసుల కోసం వారి శారీరక సుఖాల కోసం ఎంత సంపాదించినా తృప్తి చెందని వాడు దేహ భావనతో ఉన్నట్లె
11. నా కులం, నా మతం. నా ప్రాంతం. నా దేశం అని భావించే వారు ఆ సుమకారంతో ఇతరులను ద్వేషించేవాడు.
ఇతరులను బాధలకు గురి చేసే వాడు దేహ భావనలో ఉన్నట్టే.
12. ఏది జరిగినా దుఃఖించేవారు. డి జరుగుతుందని భయపడేవాడు దేహ ధావనతో ఉన్నట్టే
13. పుత్రుడు కలుగకపోతే వంశం పోయిందని దుఃఖించేవాడు మగ పిల్లల కోసం ఆరాట పడేవాడు దేహ భావన తో ఉన్నట్లే
14. నీవెవరు ruఅంటే పేరు చెప్పేవాడు, నీ తల్లిదండ్రును ఎవరు అంటే పేర్లు చెప్పేవాడు ధావనలో ఉన్నట్లే
15. తనకున్నవన్నీ చూసి అంటే ధనం. అన్నలు, పదవులు, పేరు ప్రఖ్యాతులు, పాండిశ్యం, ఉద్యోగం అన్నీ చూసిమురుసిపోయేవాడు దేహ భావనలో ఉన్నట్లే
16 జుట్టుకు రంగు వేసుకునే వారు, గోళ్లకు రంగు వేసుకునే వారు, మ్యాచింగ్ లు చూసుకునేవారు దేహ భావంలో ఉన్నట్లే
17. ఖరీదైన అందమైన వస్త్రాలు, ఆభరణాలు ధరించాలనుకునే వారు వాటిని సమకూర్చుకునే వారు వాటి మీద మసుకారం ఉన్నవారు దేహభావనలో ఉన్నట్టే.
18. ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని ఉన్నా తృప్తి లేని వాడు దేహభావనలో ఉన్నట్లే
. 19 చేసిన ప్రతీ దానికి పేరు ఆరించేవాడు, పేరు కోసం తాపత్రయపడే వాడు దేవా భావనలో ఉపుట్టే
20. శీతోష్టాలు, సుఖ దుఃఖాలు మానావమానాలకు చలించిపోయేవాడు. స్పందించే వాడు దేవభావనలో ఉన్నట్టే
21. ఎవరైనా తిట్టినా అవమానించినా వెంటే స్పందించేవాడు. వారి మీద ద్వేషం, క పగ పెంచుకునే వాడు ప్రతీకారం. తీర్చుకోవటానికి ప్రయత్నించేవాడు దేహ భావనలో ఉన్నట్టే
22.తనగురించి వచ్చిన విమర్శలకు స్పందించే వాడు. ఇతరులను విమర్శించే వారు. వ్యర్ధంగా మాట్లాడేవాడు, కాలాన్ని వృధా చేసేవాడు దేహ భావనలో ఉన్నట్
23. ఇతరుల బాగుగురించి ఆలోచించని వాడు, ఇతరులు క్షేమం కాంక్షించని వాడు. ఇతరులు వేరు అనుకునే వాడు దేహభావనతో ఉన్నట్టే
24. తన స్వార్థం కోసం ఇతరులను మోసం చేసే వాడు, దోచుకునేవాడు, కష్టపెట్టువాడు, నష్టపరిచేవాడు. హింసించేవాడు, ఇక భావన లో ఉన్నట్లే
25 జీవులను హింసించేవాడు. మాంస భక్షణ చేసేవాడు దేహ భావనలో ఉన్నట్టే
26. భూమి మీద కంటికి కనబడేవన్నీ నిజం, శాశ్వతం అనుకునేవాడు దేహ భావనలో ఉన్నట్టే
27. తన విజయాలకు తానే కారణం అనుకునేవాడు. అన్నీ నేనే సాధిస్తున్నాను అని అహంతో, గర్వంతో జీవించేవాడు దేహ భావనలో ఉన్నట్లే
28. ఈ సంసారం, భార్యా పిల్లలు, జీవితం అన్నీ నిజమనుకునేవాడు దేహ భావనలో ఉన్నట్టే
29. దేహమే తాను అనుకునేవాడు ఆత్మ గురించి అవగాహన లేని వాడు, దేహ భావనలో ఉన్నట్లే
30. చావుకు భయపడేవాడు, చనిపోయిన తరువాత జీవితం లేదనుకునేవాడు దేహ భావనలో ఉన్నట్లే
31. తాను పురుషుడు, ఆమె స్త్రీలని భావించేవారు కూడా దేహ భావనలో ఉన్నట్టే
32. తాను వేరు భగవంతుడు వేరు అనుకునే వాడు కూడా దేవా భావనలో ఉన్నట్టే
33. ప్రపంచంలో తన కళ్ళ ఎదుట ఎన్ని మార్పులు చూస్తున్నా అన్నీ శాశ్వతం, అంతా శాశ్వతం అని భావించేవాడు, దేహ భావనలో ఉన్నట్లే
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇన్ని రకాలుగా మానవులు దేహ భావనలో జీవిస్తూ ఉన్నందువల్ల తానే భగవంతుడు అన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ దేహ భావన వదులుతాడో వెంటే అహం బ్రహ్మాస్తి అని తెలుసుకుని దైవ ' స్వరూపుడవుతాడు. అందరూ ఒకటేనని తెలుసుకుంటాడు. జీవన్ముక్తుడవుతాడు. అందుచేత ఈ దేహ భావనలన్నీ తొలగే దాకా తీవ్ర ధ్యాన సాధన చెయ్యండి మెల్లమెల్లగా మీలో నుండి ఒక్కొక్క దేహ భావనా తొలగిపోతుంది. చివరకు దైవ స్వరూపులవుతారు.
దేహ భావనకు కొన్నిఉదాహరణలు. || Some examples of body concept || prudhviinfo