-->

నెల రోజుల పాటు మంచువాన || snowrain || prudhviinfo



 ఈ కాలంలో మనం కొద్దిపాటి చలిగాలికే గజ గజవణుకుతున్నాం కదా? కానీ మనదేశంలోనే ఓ ప్రదేశంలో నెల రోజుల పాటు నిరంతరం మంచు వర్షం పడుతూ ఉంటుంది. అదెక్కడో తెలుసా? జమ్మూ-కాశ్మీర్ లో బారాముల్లా జిల్లాలో గుల్మార్ట్అనే ప్రాంతం ఉంది. ఇది ఎత్తయిన ప్రదేశం. గుల్మార్ అంటే పూలదారి అని అర్ధం. అక్కడ ఎండాకాలంలో ఒక మోస్తారు ఎండ వస్తుంది. చలికాలంలో మాత్రం మంచు విపరీతంగా కురుస్తుంది. జనవరి నెలంతా మంచు కురుస్తూనే ఉంటుంది. ఇక్కడ స్ట్రాబెర్రీ లోయలు, యాపిల్ తోటలు, బయో స్పియర్రి జర్వులు, గోల్ఫ్ కోర్సు, మహారాణి టెంపుల్, పెద్ద పెద్ద పైన్ చెట్లు ... ఇలా పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. మంచు కురుస్తున్నప్పుడు ఆ December దృశ్యాలను చూడటానికి విదేశాల నుంచి పర్యాటకులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. వారి కోసం హోటళ్లు ఏర్పాటు చేశారు. వారు మంచుపై స్కేటింగ్ చేస్తూ ఆనందపడుతుంటారు. ఇక్కడ 'గుల్మార్ట్ గొండోలా' అనే 3,979 మీటర్ల ఎత్తయిన ప్రదేశం ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి రోప్ వే ఉంది. ఆ దగ్గర్లోనే అఫర్వత శిఖరం ఉంది. దీని చూసేందుకు కొంతమంది ధైర్యం చేసి వెళుతుంటారు.


నెల రోజుల పాటు మంచువాన || snowrain || prudhviinfo



PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT