-->

ఎడారిలో మంచువర్షం || Snow in the desert || prudhviinfo

Snow in the desert

 

ఎడారిలో మంచువర్షం

ఎడారి అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది సహారా. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయిన సహారాలో మంచు వర్షం కురుస్తోందట. 'నీటి చుక్క కూడా దొరకని ఈ ఎడారిలో మంచు వరం ఏంటి?' అని ఆశ్చర్యపోతున్నారా! నిజమే... ఓ ఫొటోగ్రాఫర్స హారా ఎడారిలో మంచు కురుస్తున్న చిత్రాలను తీసి... సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్చే యడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. 

  గత 42 ఏళ్లలో సహారాలో మంచు కురవడం ఇది నాలుగోసారి. కాకపోతే, హిమపాతం ఈసారి గతంలో కంటే ఎక్కువగా ఉంది. ఎంత అంటే... దాదాపు 16 అంగుళాల మేర ఇసుకను మంచు కప్పేసిందట. సూర్యుడు నిప్పులు కక్కే ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా -3 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణంలో మార్పులు, ఐరోపా నుంచి వీస్తున్న అతి చల్లని గాలుల వల్లే మంచు పడుతున్నట్లు నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగారు వర్ణ ఇసుక ధగధగల మధ్య మంచు పరుచుకున్న చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

 ఎడారిలో మంచువర్షం || Snow in the desert || prudhviinfo


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT