![]() |
shine with Aloevera |
కలబందతో మెరిసిపోవచ్చు
కలబందలో విటమిన్ సి, విటమిన్ ఇ, బెటాకేరటిన్అ ధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ముడతలను, మొటిమలను వంటి సమస్యలను నివారించడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా, ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ముందుగా ముఖాన్ని భ్రపరుచుకోవాలి. కలబంద గుజ్జులో కొద్దిగా బియ్యపు పిండిని వేసి బాగా కలిపి ముఖానికి రాసుకుని సున్నితంగా రెండు నిమిషాలు మర్దనా చేయాలి.
ఐదు నిముషాల తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇందులో ఉన్న యాంటి ఎంజైమ్ గుణాలు ముఖంపై ఉన్న వృద్ధాప్య ఛాయలను నివారించి యవ్వనంగా కనపడేలా చేస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు పోతాయి. ఎక్కువగా బయట తిరిగేవారికి ముఖం కాంతివంతంగా ఉండదు. అలాంటివారు రాత్రి పడుకున ముందు కలబంద గుజ్జును రాసుకున్నట్లయితే ఇది చర్మంలోని మృత కణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
జిడ్డు చర్మం కలవారు కలబంద గుజ్జులో కొద్దిగా టమాటో రసం, కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని 20 నిముషాల తరువాత కడిగివేయాలి. టమాటో మరియు నిమ్మరసం చర్మకాంతిని సహజంగా పెంచి, చర్మంలోని మృత కణాలను తొలగిస్తాయి. కలబంద చర్మంపై ఉన్న జిడ్డును తొలగించి చర్మాన్ని తాజాగా ఉండేలా చేస్తుంది.
కలబందతో మెరిసిపోవచ్చు || shine with aloevera || prudhviinfo