![]() |
Remote savings means |
రిమోట్ సెన్సింగ్ అంటే...
మనం టీవీ చూసేటప్పుడు దూరంగా కూర్చుని పాకెట్ "కాలిక్యులేటర్ లాంటి" సాధనంతో టెలివిజను ఆన్ చేయటం, శబ్దాన్ని పెంచటం, తగ్గించటం, ఛానల్మార్చుకోవటం, తిరిగి ఆపుచేయటంలాంటి పనులు చేస్తూ ఉంటాము. దీనినే "రిమోట్కంట్రోలో లేదా "సుదూర నియంత్రణ" విధానం అని పిలుస్తారు. ఇలాంటిదే “రిమోట్సె న్సింగ్ విధానం" కూడా, దూరం నుండి కెమేరా కన్ను చూచి చక్కగా ఫొటోలు తీస్తుంది. అందువల్ల దీనిని రిమోట్ సెన్సింగ్విధానం అంటున్నారు. ఎంతో దూరంలో ఉన్న వస్తువులు, ప్రదేశాలు, వాటిని గురించిన సమాచారం సేకరిస్తుంది. కాబట్టి మనం “సుదూర గ్రాహకం" అనుకోవచ్చు. రిమోట్సె న్సింగ్ అనే పదం 1960 లోనే పుట్టింది. అమెరికాలోని 'మిచిగన్ • విశ్వవిద్యాలయం లోని “విల్లోరన్' పరిశోధనాలయంలో ఈ పదం పుట్టింది. అప్పటి నుంచి శాస్త్ర ప్రపంచంలో ఈ పదం ప్రచారంలోకి వచ్చింది. దూరం నుండి దృశ్యాలను ఫొటోలను తీసే పద్ధతి మన దేశంలోనూ, ఇతర దేశాలలోనూ 1920 నుండి ప్రచారంలో వున్నది.
అప్పుడు దానిని "పరియల్ ఫొటోగ్రఫీ" అని అనేవారు. భూమిని సర్వేచేయటం కోసం విమానాల నుండి ఫొటోలు తీసేవారు. అదే "ఏరియల్ఫొటోగ్రఫీ”. ఇది ఒక విధంగా ఆనాటి "రిమోట్సెన్సింగ్", అంతరిక్షంలోకి పంపించిన ఉపగ్రహాలు భూకక్ష్యలో తిరుగుతాయి. అలా తిరుగుతూ తమలో వున్న కెమెరాల ద్వారా భూమిని వివిధ కోణాల్లో ఫొటోలు తీస్తాయి. అట్టా తీసి భూమిపై నున్న కేంద్రాలకు ప్రసారం చేస్తాయి. రిమోట్ సెన్సింగ్ లో సమాచారాన్ని రెండు పద్ధతుల్లో సేకరిస్తారు. సౌరశక్తిని ఇంధనంగా ఉపయోగించుకొని ఫొటోలు తీయటం ఒక పద్ధతి. దీనిని "పాసివ్ సిస్టం" అంటారు. కృత్రిమ పద్ధతుల ద్వారా సాధించిన ఇంధనాలను ఉపయోగించి రాత్రింబవళ్లు ఫొటోలు తీయటం ఇంకో పద్ధతి. ఇలాంటి పద్ధతికి "యాక్టివ్ సిస్టమ్" అనిపేరు. రిమోట్సెన్సింగ్ ద్వారా సేకరించిన సమా.
రిమోట్ సెన్సింగ్ అంటే... || Remote savings means ... || prudhviinfo