-->

ఎర్రకోటకు ఎంతో చరిత్ర || The Red Fort has a good history || red fort agra || prudhviinfo

Red fort Agra

 

ఎర్రకోటకు ఎంతో చరిత్ర

   భారతదేశంలో అద్భుత కట్టడాల్లో ఒకటైన ఎర్రకోట గురించి ఈ రోజు తెలుసుకుందాం. ప్రపంచ వారసత్వ సంపదగా మన దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటకు గుర్తింపు ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగే సంబరాలన్నీ అక్కడే జరుగుతాయి. ఈ ఎర్రకోటకు 373 ఏళ్ల చరిత్ర ఉంది.

    మొగల్ చక్రవర్తి అయిన షాజహాన్ 1638లో దీని నిర్మాణం మొదలు పెట్టాడు. 1648లో పూర్తి అయింది. ఎర్రకోట గోడలపై పర్షియా కవి అమీర్ ఖుస్రో రాసిన కవితలోని కొన్ని పదాలను అక్కడక్కడ బంగారు పూతతో చెక్కించారు. ఎర్ర చలువరాతితో నిర్మించిన ఈ కోట యమునా నది ఒడ్డున, మొత్తం 120 ఎకరాల స్థలంలో పర్షియా నుంచి రప్పించిన నిపుణులతో కట్టించారు.

   సభ జరిపే మండపం పై కప్పు యాభై అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పుతో, వెండి, బంగారం పూత పూయించారు. ఇందులో వజ్రాలు, మణులు పొదిగిన నెమలి సింహాసనం చేయించారు. కోటలోని ఉద్యానవనాలు, పాలరాయి మండపాలు, నీటిని చిమ్మే ఫౌంటెన్లు చూడటానికి అందంగా ఉంటాయి. పర్షియా రాజు నాదిర్‌షా 1739లో దండెత్తి వచ్చి అప్పటి రాజు మహ్మద్ షాను ఓడించి అనేక సంపదలతో పాటు నెమలి సింహాసనాన్ని తరలించుకుపోయాడు.

    1947 ఆగస్టు 15న తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఈ కోటపై జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతోంది. కోట ప్రహరీగోడ రెండు కిలోమీటర్ల పొడవుతో, 90 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇందులో ముంతాజ్మ హల్ మ్యూజియం, మోతీమజీద్, రంగ్ మహల్ ఉన్నాయి.


 ఎర్రకోటకు ఎంతో చరిత్ర || The Red Fort has a good history || red fort Agra || prudhviinfo

tags:-

Red fort Agra, Red Fort was built by, Red Fort is made up of which rock, Importance of Red Fort, Importance of Red Fort on 15th August

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT