![]() |
Personality |
వ్యక్తిత్వం - మనస్తత్వం
++++++++++++++++++++++++++++++++++++++++++++++
మనిషి వ్యక్తిత్వం దైనందిన కార్యకలాపాలను శాసిస్తుంది. బలహీన వ్యక్తిత్వం కలిగిన వారు జీవితంలో బహుముఖాలుగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ వ్యక్తిత్వం, మనస్తత్వం, జీవితమనే నాణానికి బొమ్మా బొరుసా లాంటిషన్ ఒకే వ్యక్తి కొడుకుగా, భర్తగా, తండ్రిగా, కూతురుగా, కోడలుగా అనేక పాత్రలు పోషించాల్సి ఉంటుంది. కర్తవ్య నిర్వహణలో ఏ మాత్రం పొరపాటు జరిగినా పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. బలహీన మనస్కులు అందరినీ సంతృప్తిపరచాలని ప్రయత్నించి చివరికి ఎవరినీ సంతోషపెట్టలేక కోరి కష్టాలు తెచ్చుకుంటారు. జీవితం అంటేనే ఒక సమస్య నుండి మరో సమస్యకు చేసే ప్రయాణం వంటిది. బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్యాల్లో ప్రతి వ్యక్తిని కొన్ని సమస్యలు
చుట్టుముట్టడం సర్వ సాధారణం. ఆ సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడం లోనే వ్యక్తిత్వం, మనస్తత్వం ప్రధాన భూమిక వహిస్తాయి. నిజాయతీ, నిర్మొహమాటం, నిష్పక్షపాతం వంటి లక్షణాలు నిష్కళంక వ్యక్తిత్వానికి నిదర్శనాలు, ఒత్తిళ్లకు లొంగడం, ఆడంబరాలు, ఆరాటాలు టాలు, డాబు, దర్పం వంటివి | బలహీన మనస్తత్వానికి ప్రతీకలు ఇతరులకంటే తాను గొప్పవాడినన్న అహాన్ని సంతృప్తిపరచుకోవడంలోనే ఇలాంటి వారు చాలా నష్టపోతారు. చివరికి ఎవరినైతే సంతృప్తిపరచాలని ప్రయత్నించారో వారినుంచే అవహేళనకు గురవుతారు. సజ్జన సాంగత్యం, సర్ద్రంధపఠనం, సంయమనం సమదృష్టి వంటివి చక్కని వ్యక్తిత్వానికి బాటలు పరుస్తాయి. సమాజం లోని ప్రతివ్యక్తీ మనకు ఏదోఒక సందేశం ఇస్తుంటాడు. కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే, మరికొందరిని పరిశీలిస్తే ఎలా ఉండకూడదో బోధపడుతుంది. మనకు తారసిల్లే
వ్యక్తుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లు అని రెండు వర్గాలుగా మనమే విభజించకూడదు! అవసరం బట్టి స్నేహం, అవకాశం బట్టి శీలం ఆధారపడి ఉంటాయన్న