![]() |
Not Eating properly |
సరిగా తినడం లేదా?
పిల్లలు ఆటల్లో పడి సరిగ్గా తినడం లేదా? వాళ్ళకి నచ్చిన ఐటమ్ తప్ప ఇంకే ఫుడ్ పెట్టినా ముఖం పక్కకి తిప్పేస్తున్నారా? పిల్లలు అన్ని ఫుడ్స్తి నకపోవడానికి ఓ కారణం ఉంది. అదేమిటంటే వారి టేస్ట్ బడ్స్ పూర్తిగా డెవలప్ అయ్యి ఉండవు. వారు అన్ని ఫుడ్స్ ని ఎంజాయ్ చేయలేరు. కాబట్టి ఈ లోపు కొన్ని టిప్స్ పాటిస్తే పిల్లలకి సమతులాహారం అందుతుంది. పిల్లల ఆకలిని గౌరవించడం: పిల్లలు ఆకలిగా లేదు. అంటే బలవంతంగా తినిపించకండి. తినడం కోసం లంచాలు ఇవ్వడం కానీ చేయకండి. దీని వల్ల ఆహారం అంటే వ్యతిరేక భావం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. అంతే కాక మీల్స్ అంటే ఓ రకమైన ఆందోళన పిల్లల్లో కలుగుతుంది. దాంతో తమ ఆకలికి త్వరగా స్పందించరు. కడుపు నిండినట్టు కూడా అర్థం కాదు. వారంతట వారే ఇంకా కావాలని అడిగే అవకాశం వారికి ఇవ్వండి. రొటీన్ ని ఫాలో: మీల్స్, స్నాక్స్ రోజూ ఒకే టైమ్ తినిపించండి. మీల్స్టై మ్ లో తినకపోతే స్నాక్స్ లో న్యూట్రిషన్ ఫుడ్ తినే అవకాశం ఉంటుంది.
ఫుడ్ తో పాటూ పాలు లేదా ఫ్రట్ జ్యూస్ ఇవ్వవచ్చు. కానీ మీల్స్, స్నాక్స్మధ్యలో మాత్రం నీరే ఇవ్వండి. రోజంతా ఏదో ఒకటి తింటూ తాగుతూ ఉండే అలవాటు వల్ల పిల్లలకి మీల్స్ టైమ్ లో ఆకలిగా అనిపించదు. కొత్త ఫుడ్స్ విషయంలో ఓపిక: చిన్న పిల్లలు కొత్తగా ఉన్న ఆహార పదార్ధం కనిపిస్తే ముందు దాన్ని తాకుతారు. ఆ తరువాత వాసన చూస్తారు, అప్పుడు నోట్లో పెట్టుకుంటారు. నచ్చితే తింటారు లేదా వెనక్కి తీసేస్తారు. కొత్త ఫుడ్ మళ్ళీ మళ్ళీ పరిచయం చేస్తే గానీ పిల్లలు వాటికి అలవాటు పడరు. మీ పిల్లలలో ఫుడ్ రంగు గురించీ, షేప్ గురించీ, టెక్సర్ గురించి, వాసన గురించి మాట్లాడండి. మీ పిల్లల ఫేవరేట్ ఫుడ్స్ తో పాటు కొత్త ఫుడ్స్ పరిచయం చేయండి. మీ పిల్లలలి హెల్దీ చాయిసెస్ ఇస్తూ ఉండండి.
వేరేగా వండకండి: మామూలుగా వండిన ఫుడ్ ని మీ పిల్లలు తినకపోతే వారికి వేరేగా మళ్ళీ వండి పెట్టకండి. ఇది అలవాటు చేస్తే వారు ఆసలు కొత్త ఫుడ్స్ వైపు ముఖం కూడా తిప్పరు. వారికి నచ్చినా నచ్చకపోయినా, తిన్నా తినకపోయినా అందరి భోజనం అయ్యే వరకూ వారు టేబుల్ దగ్గరే కూర్చోవాలని చెప్పండి. సరదాగా సర్వ్ చేయండి: మీ పిల్లలకి పెద్దగా నచ్చని ఫుడ్ ఐటెమ్స్ ని వారికి నచ్చే వాటితో కలిపి సర్వ్ చేయండి. బ్రకోలీ లేదా ఇతర కూరగాయల్ని వారికి నచ్చే , డిప్ తో ఇవ్వండి. కుకీ కటర్స్ తో ఫుడ్ ని వివిధ రకాల షేప్స్ ల కట్ చేసి పెట్టండి. బ్రేక్ ఫాస్ట్ ఫుడ్స్ ని డిన్నర్ టైమ్ లో సర్వ్ చేయండి. మంచి బైట్ కలర్స్ లో ఉన్న ఫుడ్స్ ని పిల్లలకి పెట్టండి. పిల్లల హెల్ప్ తీసుకోండి: కూరలు కొనడానికి వెళ్ళేప్పుడు మీ పిల్లల్ని కూడా మీతో పాటు తీసుకు వెళ్ళండి. వారికి నచ్చిన పండ్లు, కూరలు వారిని ఎంచుకోమనండి. మీ పిల్లలు తినకూడదు అని మీరు అనుకున్న వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకండి. ఇంట్లో కూరలు కడగడం, పిండి కలపడం, టేబుల్సె ట్ చేయడం వంటి పనులు పిల్లలకి అప్పగించండి. పిల్లలు ఎక్కువగా పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు. వీలున్నంత వరకూ ఆ సమయంలో ఫోన్కా ల్స్ అటెండ్ అవ్వడం కూడా మానేయండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలకి ఫుడ్ మీదే ఫోకస్ ఉంటుంది. అలాగే టీవీలో వచ్చే యాడ్స్ వల్ల పిల్లలకి షుగర్ ఎక్కువగా, పోషకాలు తక్కువగా ఉన్న ఫుడ్స్ మీదకి మనసు పోతుందని గుర్తుంచుకోండి.
సరిగా తినడం లేదా? || Not Eating properly || prudhviinfo