![]() |
Know the eternal truths |
నిత్య సత్యాలు తెలుసుకో
"ధర్మాన్ని కాపాడండి అది మిమల్ని కాపాడుతుంది"
నిత్య సత్యాలు తెలుసుకో ....
వంద కోట్లకు అధిపతియైన -
ఒక్క నిమిషం ఆయుష్షు కొనలేవనితెలుసుకో.....
కోటి కోట్లకు వారసునీవై నా ఉపిరిపోగానే ఉరిబయట పారేస్తారనితెలుసుకో.....
లక్షాధికారైనా, బిక్షాధికారైనా - స్మశానంలో ఇద్దరు సమానమేనని తెలుసుకో...
వంద మంది డాక్టర్లు నీ వెంటవున్నా
నీ ఆయుష్షుకు అధిపతిని కాలేవని తెలుసుకో .....
యావత్ ప్రపంచాన్ని జయించగలిగిననూ - మృత్యువుని జయించలేవని తెలుసుకో......
కాలం విలువైనది, రేపు అనుదానికి రూపు లేదు -
మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో.....
లక్షలు, కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు -
ఆ లక్షలు నీ వెంట రావని, మృతువు నుండి తషించుకోలేవని తెలుసు కో...
నీవు తీన్నదిమట్టిపాలు - ఇతరులకిచ్చినది నీ పాలని తెలుసుకో.....
నీవు దాచుకున్నది జారిపోతుంది - ఇతరులకిచి సహకరించినది నీ ఖతాలో జమ అవుతుందని తెలుసుకో....
భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు మంచి పనులకు ఖర్చుచేసి పుణ్యాన్ని పెంచుకో ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించుననితెలుసుకో ....
దాచి పెట్టి ఏం చేస్తావ్ -జేబు అయిన ఉండదు ఆ శవం మీద గుడ్డకు ప్రపంచానికి తాను చేసిన మేలే మనవునికి నిజమయిన సంపద ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు - ఏ మంచి పనులు చేస్తామన్నది ముఖ్యం ఇతరులకు కష్టం కలిగించడం ఎంత పాపమో - ఇంకొకరి కష్టం తీర్చడం అంత పుణ్యం ధనంతో పరుపును కొనవచ్చును కాని నిద్రను కాదు....
ధనంతో పుస్తకాలను కొనవచ్చును. కాని మేదస్సును కాదు..
ధనం దుస్తులను కొనవచ్చను కాని ఆత్మ సౌందర్యాన్ని కాదు..
ధనంతో ఔషధాన్ని కొనవచ్చును కాని ఆరోగ్యాన్ని కాదు...
ధనంతో విలాస వస్తువులు కొనవచ్చును కాని సంతోషాన్ని కాదు...
ధనంతో ఆడంబరం కొనవచ్చును కాని స్వర్గాన్ని కాదు..
ధనంతో దేవాలయాన్ని కొనవచ్చును కాని భగవంతుణ్ణి కాదు...
నీవుచేసే భగవంతుని సేవ విత్తనమంత అయితే... నీవు పొందే ప్రతిఫలం ఆచెట్టు కాసే ఫలమంత!