![]() |
How the stars formed |
నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి?
ఆకాశంలో తళుకుతళుకుమంటూ కనిపించే నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం. దాదాపు 15 బిలియన్ సంవత్సరాల క్రితం 'బిగ్ బ్యాంగ్' అనే విస్ఫోటం మూలంగా ఈ విశ్వం ఏర్పడిందని చదువుకుని ఉంటారు కదా. అప్పుడు రోదసి అంతా దట్టమైన వాయువులు, ధూళితో కూడిన మేఘాలు వ్యాపించాయి. ఈ మేఘాల్లో 90 శాతం హైడ్రోజన్, కొద్దిపాటి ఇతర వాయువులు, సూక్ష్మ హిమకణాలు, కాస్మిక్ ధూళి ఉండేవి.
ఇవన్నీ గురుత్వాకర్షణ శక్తి వల్ల కుంచించుకుపోతూ ఉంటాయి. ఫలితంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రత 10 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ కు చేరుకున్నప్పుడు హైడ్రోజన్ అణువులు సంయోగం చెంది హీలియం ఏర్పడుతుంది. ఫలితంగా అత్యధిక శక్తి కాంతి రూపం 'నక్షత్రం' ఏర్పడుతుంది. నక్షత్రంలో హైడ్రోజన్ ఇంధనం లభించినంత వరకూ తాపకేంద్రక చర్యలు జరుగుతూనే ఉంటాయి.
హైడ్రోజన్ ఖాళీ అయిపోగానే గురుత్వ ప్రభావం వల్ల నక్షత్ర కేంద్రకం కుంచించుకుపోవడం మొదలవుతుంది. దాంతో కేంద్రకం అంచుల వద్ద ఉండే కర్పరంపై ఒత్తిడి పెరిగి ఉష్ణం ఉద్భవిస్తుంది. అప్పుడు కర్పరంలో మిగిలిన హైడ్రోజన్ పరమాణువుల మధ్య కేంద్రక సంలీనం జరుగుతుంది. దాని ఫలితంగా నక్షత్ర పొరలు వ్యాకోచం చెంది దాని వ్యాసం అనేకరెట్లు ఎక్కువవుతుంది. ఈ దశలో అరుణకాంతిని వెదజల్లే నక్షతాన్నే 'రెడ్ జెయింట్' అంటారు. రెడ్ జెయింట్ లో హైడ్రోజన్ అయిపోయాక తన లోని పదార్ధ కణాలను వెదజల్లుతూ పేలిపోతుంది.
నక్షత్రం కాంతిని కోల్పోయి మసకబారుతుంది. నక్షత్రంలో మిగిలిన ద్రవ్యకణాలు ఎక్కువ ఒత్తిడికి లోనవడంతో అది అంతకు ముందున్న ఘన పరిమాణంలో 1/10 వంతుకు తగ్గి మరుగుజ్జులా మారి తెల్లని కాంతిని వెదజల్లుతుంది. ఇదే వైట్ డ్వార్ఫ్,
TAGS:- how are stars formed step by step, How are stars formed simple, How are stars formed simple, How the stars formed in Telugu, How the stars formed.