![]() |
HAPPYNESS |
ఆనందాన్ని పెంపొందించుకోవాలంటే...
++++++++++++++++++++++++++++++++++++++++
డబ్బు ఆహారాన్ని కొనగలుగుతుంది. కానీ, ఆకలిని కొనలేదు. డబ్బు మందులను కొనగలుగుతుంది. కానీ, ఆరోగ్యాన్ని కొనలేదు. డబ్బు మెత్తని పరుపులను కొనగలుగుతుంది. కానీ, నిద్రను కొనలేదు. అలానే మరెన్నో విషయాలను డబ్బు కొనగలుగుతుంది. కానీ నిజమైన, నాలుగు కాలాల పాటు నిలిచే ఆనందాన్ని కొనలేదు. డబ్బు ముఖ్యమే! అంతకన్నా ముఖ్యం. ఆ డబ్బు ఎలా సంపాదించామన్నది. అలానే, దేనికి, ఎంత ఖర్చు పెడుతున్నామనేది ముఖ్యమే. దుబారాలు తగ్గించుకుంటే, సంపద పెరుగుతుంది. న్యాయంగా, ధర్మంగా సంపాదించిన డబ్బు మనకు
దక్కుతుంది. చాలా సందర్భాలలో, అన్యాయంగా సంపాదించింది. అన్యాయపు పనులకు ఖర్చయిపోతుంది. పోతూ పోతూ, ఎంత తీసుకువెళ్లిపోతుందో ఎవరికెరుక? సుఖం వేరు ఆనందం వేరు డబ్బు సుఖాన్ని కొనుక్కొనే అవకాశాలను ఇవ్వవచ్చు. ఆ సుఖాలు క్షణికమైన, తాత్కాలికమైన ఆనందాన్ని. ఇవ్వవచ్చు. కానీ, క్షణం దాటిన తరువాత మరింకింత దుఃఖాన్ని కలిగిస్తాయి. అందుకే, సుఖదుఃఖాల గురించి ఆలోచిస్తున్నపుడు, మన మనస్సుతో పాప పుణ్యాల ప్రసక్తి మొదలటం, మనల్ని మంచివైపు నడిపిస్తుంది. సుఖం అల్ప స్థాయికి చెందింనది. అయితే, ఆనందం ఉన్నత స్థాయికి చెందినది. సుఖలాలసత కూడదు. ఆనందాన్వేషణ ఆపకూడదు. భౌతిక సుఖాలే, సుఖాలు అని అనుకోవటం మానవున్ని తక్కువ స్థాయి వైపు నెట్టివేయడం అవుతుంది. శాశ్వత ఆనందం వైపు దృష్టి సారించాలి. ఆనందం మనసు పొరల్లో మెదులు తుంది. లోతుగా స్థానం కల్పించుకుంటుంది. మరిన్ని మంచి పనులకు ప్రేరణను కలిగిస్తుంది. మరింకింత మంచి ఆనందాన్ని పొందే మార్గాలను సూచిస్తుంది. చెయ్యి పట్టుకుని
నడిపిస్తుంది. రక్షిస్తుంది. వ్యసనాలకు ఉన్న ఆకర్షణ ఎక్కువ మనకు తెలీకుండానే, ఎవరి ప్రోద్భలం వల్లనో పరిచయమై, అలవాట్లుగా ఎదిగి, వ్యసనాలుగా మారి మన మనస్సుపై తమ ప్రభావాన్ని పదిలపరచుకుంటాయి. పట్టు బిగిస్తాయి. ఆ వ్యసనాల మత్తులో, మనం ఊబిలో చిక్కుకున్నామన్న విషయాన్ని విష్కరిస్తాం. వ్యసనాలు సంతోషాన్ని కలిగిస్తాయనే భ్రమలో ఉంటాము. కొన్నాళ్ళకి ఒక తెగింపు ఏర్పడి, ఇంతవరకూ చాటుగా పదిమందికి తెలియకుండా ఉన్న వ్యసనాలు, పదిమంది ముందు చేసినా లేక పట్టుబడినా ఫరవాలేదులే అనే చొరవను - ఒక రకంగా సిగ్గులేనితనాన్ని ప్రోత్సహిస్తాయి. అందుకే, జీవితంలో పైకి రావాలంటే, చెడు అలవాట్లను వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఇప్పటికే కాపురం చేస్తున్న చెడు అలవాట్ల తొలగించుకోవటానికి గట్టి ప్రయత్నం చేయాలి. వ్యసనాలు ఆనందాన్ని ఇవ్వవు. ఇవ్వలేవు. వ్యసనాలు పతనాన్ని వేగవంతం చేస్తాయి. పడిన తరువాత లేచి నిలబడవచ్చుగదా! అని కాకుండా, అసలు వ్యసనాల వలలోనే పడకుండా జాగ్రత్తగా మసలుకోవాలి. ముందుగానే మేలుకోవాలి. మేలుకొనే జీవించాలి.
కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితం గడపాలంటే, ఈ రోజు నుండి మీ దురలవాట్లను దూరం చేసుకోండి. హ్యాపీగా జీవించండి.
happiness || ఆనందాన్ని పెంపొందించుకోవాలంటే || prudhviinfo