![]() |
Good ideas are the foundation of a good life |
మంచి ఆలోచనలే మంచి జీవితానికి పునాది
++++++++++++++++++++++++++++++++++++
1 అన్నింటికి ఆలోచనలే మూలం. మనసు నిండా ఆలోచనలే ఉంటాయి. మంచి ఆలోచనలు ఉన్నప్పుడే మంచి మనసు అవుతుంది మంచిమనసే మంచి జీవితానికి దోహదం చేస్తుంది. ఆలోచించటం నేర్చుకుంటే తెలుసుకోవటం తెలుస్తుంది. తెలుసుకోకుండా ఏట నేర్చుకోలేo మాటలకు. చేతలకు, అలవాట్లకు, అన్నింటికి ఆలోచనలే మూలం
2మనిషి పుట్టడం గొప్ప అవకాశం అరుదైన వరం మంచిపనులు చేసేందుకు ఈ జన్మను వినియోగించుకోవాలని గుర్తుంచుకోండి
3మానవత్వం నుండి దైవత్వం వైపు పయనించాలని గమనించండి. మానవతా విలువలనుపాటించండి. ఉన్నత భావాలను ఆహ్వానించండి. ఆచరించండి
4మంచిగా ఉండాలని, మంచిని పెంచాలని గుర్తుంచుకోండి. చెడుకు దూరంగా ఉండాలని గ్రహించండి.
5. స్త్రీ పురుష భేదం చూపకుండా అందరినీ గౌరవించడం నేర్చుకోండి. చులకన భావంతో చూడగండి. మోసాలకు పాల్పడకండి. తలెత్తుకొని ఉండేలా జీవించండి. తలవంపులు ఎదురయ్యే పనులేవీ చేయవద్దు.
6. మంచి అలవాట్లను ఆహ్వానించండి. పట్టుదలతో ప్రారంభించండి. మొదలుపెట్టిన తేదీ నుండి, కనీసం 21 రోజులు నిర్వరామంగా కృషిచేస్తే కొత్త అలవాటు బలంగా నాటుకుంటుందని గమనించండి. సహసం లేకుండా సాధించలేమని గుర్తించండి. పట్టుదల సడలనప్పుడే పట్టు బిగిస్తుందనిగుర్తించండి. బిగిసిన పట్టు విజయాన్ని సంపాదించి పెడుతుంది.
7ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఎప్పుడోఅనారోగ్యంపలకరిస్తున్నప్పుడు చూసుకోవచ్చులే" అనే నిర్లక్షవరము విడనాడండి. వీలున్నంత తొందరగా లేవడం, ఉదయంపూట నరక, కొంత శారీరక శ్రమ మీ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని గమనించింది. చురుగా ఉండండి. చురుకుదనాన్ని పెంచుకుంటూ ఉండండి.
. 8ప్రతిరోజూ ఉదయం పూట కాసేపు యోగ, ప్రాణాయామం, ధ్యానం, ఎంతో మేలు చేస్తాయని గుర్తించంది. వీలుస్తంత తొందరలో
ప్రారంభించండి. ఇవనీ పనిలేని వాళ్లకి, ముసలి వ్యాకి లేక ఆధ్యాత్మిక చింతనలో మునగదలచుకున్న వారికి అవసరమనే భావన తప్పని
గ్రహించండి. అప్పుడప్పుడైనా, నింపాదిగా సూర్యాదయాలను, సూర్యాస్తమయాలను గమనించి ఉత్తేజం పొందండి. ప్రకృతి అందాలు
పరవశింప చేస్తాయి. ప్రకృతిలో పరమాత్మను గుర్తించడానికి ప్రయత్నించండి. దైవద్యాన మంచి అలవాట్లకు బలమైన పునాదులను కల్పిస్తుందనిగుర్తుంచు కొండి
9ధ్యానం చేయండి. ధ్యానం మనసుని ప్రక్షాళనం చేస్తుంది. నిస్వార్ధమైన ప్రార్ధనలోను. భగవన్నామస్మరణ చేయటంలోనూ ఉన్న ఆనందం మరి దేనిలోనూ ఉండదని గ్రహిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతకన్న ఇంకేం కావాలి చెప్పండి?.
10మీ పనులు మీరు స్వయంగా చేసుకోవటం అలవాటు చేసుకొండి. ఇతరుల మీద ఆధారపడే అలవాట్లు మానుకోండి. కొంత నిరాడంబరత ఎంతో మేలు చేస్తుందని గమనించండి. ఆశలు తగ్గించుకుంటే, నిరాశపడే అవకాశాలు కూడా తగ్గురాయని గ్రహించండి. సొంత లాభం
కొంత మానుకుంటే చాలు, మనమంతా ఇంకెంతో మేలు చేయగలం. కోరికలను అదుపులో పెట్టుకుంటే, స్వార్థం కూడా తగ్గుతుందని గ్రహించండి. తగ్గిన స్వార్థపరత్వం, త్యాగానికి, సేవాభావానికి చోటిస్తుంది: సేవ సంతృప్తి నిస్తుంది. సంతృప్తి ఆనందాన్నిస్తుంది.
11ఆనందం సమానత్వాన్ని గౌరవించే ధ్యాసను కలిగిస్తుంది. ఆధ్యాస ప్రశాంతతకు దారి తీస్తుంది. ప్రశాంతమయ జీవితం విలువ తెలిసి వస్తుంది.
12.కోరికలపై అదుపు, పొదుపుకు దోహదం చేస్తుంది. పాపాలు, ధరలు పోటీపడ్ పెరుగుతున్న ఈ రోజుల్లో కోరికల ఎక్కువ అగుటవలన వచ్చే
నష్టాన్ని గుర్తించండి.
13సంపాదన పెంచుకోవటానికి సరియైన మార్గాలు అవలంభించ
వద్దని కాదు- సంపాదించిన దానిలోనే కొంత చేసి ప్రయత్నం. చేయండి. పొదుపే మిమ్మల్ని సంపన్నులను చేస్తుందని గుర్తించండి.
14.వీలున్నంతవరకు అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. శక్తికి మించిన అప్పులు చేయకండి. చేసిన అప్పులు తీర్చాలని గుర్తుంచుకోండి. వడ్డీతో సహా తీర్చవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. తిరిగి చెల్లించడంలో అలస్యాలు అయితే అసలు. ఆలస్యం చేసినపుడు వచ్చే చెడ్డపేరు. . చరుపు చేస్తుందని గుర్తించండి. ఒకసారి చెదిరిన నమ్మకం. పోగొట్టుకున్న మంచి పేరు, తిరిగి సాధించడం అంత తేలిక కాదని గుర్తుంచుకోండి.
15. కోరికల పై పగ్గాలు
. అనవసర ఖర్చులపై అదుపు ప్రణాళికాబద్ధంగా చేసే పొదుపు. జీవితంలో నెగ్గుకురావటానికి అవసరమైన, బలమైన పునాదులను ఏర్పరుస్తుయని గుర్తుంచుకోండి. తృప్తిని మించిన ఆనందం లేదని, సంతృప్తిని మించిన సంపద ఉండని గమనించండు
16"ఆ రోజు రోజుకు మరింకెంత మెరుగైన జీవితానికై మనసారా కృషి చేయండి. గదించిన నిన్న నేడు మేలైనదిగా ఉండాలి నేటికన్న రానున్న రేపు ఇంకా మెరుగ్గా ఉండాలి మెరుగైన భవిష్యత్తుకై వర్తమానాన్ని వినియోగించుకోవాలి నిరంతర సాధనయే నిరంతర లభివృద్ధికీ
17. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతలు, మంచి అలవాట్లు మంచి వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపయోగపడతాయని గుర్తుంచుకోండి.
18నీతి, నిజాయితీలు అవసరం అని. కష్టపడి పనిచేసే మనస్తత్యానికి ప్రత్యామ్నాయం ఏదీ లేదని గుర్తుంచుకోవలి
19. శ్రమ ఆరోగ్యాన్నిస్తుంది. ఆరోగ్యం ఆనందాన్నిస్తుంది. ఆనందం చక్కని ఆలోచనవస్తుంది. నదాలోచనలు మంచి మార్గని చూపిస్తాయి. మంచి మార్గం కృషికి ప్రేరణనిస్తుంది. సత్ఫలితాలనిస్తుంది శ్రీమలోని ఆనందాన్ని తెలియజేస్తుంది. శ్రమయే దైవారాధన అని అర్ధం అవుతుంది.
20 జీవితానికి లక్ష్యాలు అవసరం. లక్ష్యాలు లేకుండా జీవించడం, గురిపెట్టకుండా బాణాలను
వెయ్యటం లాంటిది. మంచి
లక్ష్యాలను నిర్దేశించు కోండి.
. అందులో కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలుగా, కొన్ని స్వల్పకాలంలోనే సాధించే అవకాశం గలవాటిగాను, విభజన చేయండి. తగిన వ్యూహాలను నిర్ణయించుకోండి. క్రమ శిక్షణ, పట్టుదల, అంకిత భావం, నిరంతర కృషి లక్ష్య సాధనకు అవసరం అని గమనించండి సాధించిన చిన్న
లక్ష్యాలు, పెద్ద లక్ష్యాలు సాధించే సామర్థ్యానీ ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తాయని గుర్తుంచుకోండి.
21. మంచి పుస్తకాలలో నుండి మంచి విషయాలు స్వీకరించండి. ఒక చిన్న పుస్తకంలో వ్రాసి పెట్టుకోండి. మరింత లోతుగా ఆలోచించండి మి జీవితానికి అన్వయించుకోండి. ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టని ఆలోచనలు వ్యర్థమని గమనించండి. ఆలోచనలు లేని ఆచరికాలు నిర్మన గుర్తించండి. ఆచరణే విజయానికి విత్తనమని గుర్తించండి.
22 ప్రస్తుతం మీలో ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి అలవాట్లు, ఎలాంటి లక్షణాలు ఏ మేరకు ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలించండి. మంచి లక్షణాలను పెంచుకునే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముఖ్యంగా చెడు లక్షణాలను దూరం చేయటానికి ప్రయత్నించండి.
23 ధైర్యాన్ని కోల్పోకండి. స్వచ్ఛమైన జీవితమే స్థిరమైన ఆనందానికి పునాది అని గుర్తించండి.
.24 మానవ సంబంధాలను నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా, (కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి. వైవాహిక బంధం పవిత్రతను గుర్తుంచుకోండి. మీ
తల్లిదండ్రులపట్ల మీ ప్రవర్తన, భవిష్యత్తులో మీ పిల్లలకు మార్గదర్శకత్వం వహిస్తుందని గుర్తుంచుకోండి. మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశంపై
మీ వైఖరి, మీ ఔన్నత్యాన్ని తద్వారా జాతి ఔన్నత్యాన్ని నిర్దేశిస్తుంది. పెద్ద వారిని గౌరవించండి విద్యను, సంస్కారాన్ని నేర్పించిన గురువులను గౌరవించండి
మీరు జీవిస్తున్న విధానమే గురువుల పట్ల మీ గౌరవానికి నిలువెత్తు సాక్ష్యమని గుర్తుంచుకోండి.
25ప్రతిరోజు ఆలోచించటానికి కొంత సమయం కేటాయించండి. ఇది చాలా ముఖ్యం వచ్చిన ఆలోచనలను వెంటనే పరీక్షల కొలిమిలోపెట్టకుండా, కాసేపు కొనసాగించండి. ఆ ఆలోచన స్వరూపాన్ని స్వభావాన్ని వ్యాప్తిని, ఉపయోగాన్ని గమనించండి. "బాగానే ఉన్నది" అని ' అనిపించినపుడు, ఒక పుస్తకంలో వ్రాసి పెట్టుకోండి. ఆచరణలో సాధ్యాసాధ్యాలను పరిశీలించండి. తొలిదశలో ఎలా అనిపించినా, మేలుచేసే ఆలోచనలు మెరుస్తూ కనిపిస్తాయి. పైకి వచ్చిన వారి జీవితాలు, పైకి ఉబికివచ్చిన ఆలోచనల సాకారరూపమని గ్రహించండి. మంచి ఆలోచనలు జీవితాన్ని మార్చగలవని గ్రహించండి. మంచి ఆలోచనలను ఆహ్వానించండి. ఒక్క మంచి గుణం, మరింకెన్నో మంచి గుణాలకు పట్టుగొమ్మగా నిలుస్తుంది.
26.ఇతరులలో మంచి గుర్తించండి. సమర్థతను అభినందించండి. పొగడ్త లేని నిజమైన ప్రశంస, హృదయం ఉప్పొంగేలా చేస్తుంది.
" మంచి తనాన్ని మరింకింత పెంచేలా ప్రోత్సహిస్తుంది. ఆ మంచి పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేయిస్తుంది. మంచిని మెచ్చుకునే మీ మంచితనాన్ని ఇతరులు గుర్తించేలా చేస్తుంది. అది మీకూ మంచి చేస్తుంది. మొత్తానికి మంచి విస్తృతమవుతూ ఉంటుంది. ఇది చాలదా? మీరే చెప్పండి.
27 నేర్చుకోవడం నేర్చుకోండి. ఒడి దుడుగులను నప్పుతూ ఉండటం నేర్చుకోండి. ఒడిదుడుకులను తట్టుకోవడం అలవాటు చేసుకోండి
.
28 ఆనందంగా ఉంచడం నేర్చుకోండి. ప్రేమించడం ప్రేమను పంచడం నేర్చుకోండి. ఆనందాన్ని పంచడం అలవాటు చేసుకొండి. నేర్చుకుంటున్న విషయాలు సమీక్షించుకోవడం అలవాటు చేసుకోండి.
29ఉన్న స్థాయి నుండి, ఉన్నత స్థాయికి వెళ్చాలన్న ధ్యాసతో, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోండి.
30బాధ్యతలను సంతోషంతో నేర్చుకోండి. దివ్వెలా ప్రకాశాన్ని వెదజల్లే జీవితాన్ని జీవించండి. స్ఫూర్తితో జీవించండి. ఇతరులకు స్ఫూర్తినిచ్చే ఎలా జీవించండి
మంచి ఆలోచనలే మంచి జీవితానికి పునాది || Good ideas are the foundation of a good life || prudhviinfo