-->

గాఢ నిద్రకోసం || For deep sleep || prudhviinfo

Deep sleep


గాఢ నిద్రకోసం...

ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరూ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నా, ముఖ్యంగా ఆఫీసు ఒత్తిడి కారణంగా గంటల తరబడి పనిలోనే నిమగ్నమవ్వడమే అందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. పైగా.. సామాజిక మాధ్యమాల వాడకం మరింత తీవ్రం కావడంతో.. నిద్రపోవడం మానేసి వాటి పైనే దృష్టి సారిస్తున్నారని ఓ పరిశోధనలో వెల్లడైంది. మరి అలాంటప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా నిద్రపోవాలంటే... ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

  1.   పాలు, పెరుగుల్లో 'ట్రిప్టోఫాన్' అనే అమినో యాసిడ్ వుంటుంది. అది త్వరగా నిద్రలో జారుకునేందుకు ప్రేరేపిస్తుంది. ఈ అమీనో యాసిడ్ బాడీ క్లాక్ పనితీరును క్రమబద్ధీకరించే సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా కంటి నిండా నిద్ర పడుతుంది. కాబట్టి... రెగ్యులర్ గా పాలు, పెరుగు తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.
  2.   ఫాక్స్ విత్తనాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మోతాదులో పుష్కలంగా నిల్వవుంటాయి. అవి ఆందోళన, ఒత్తిడి, నిరాశల తీవ్రతను తగ్గించి వాటి వల్ల తలెత్తే ఇన్సెమ్నియా (నిద్రలేమి)ని పోగొడతాయి. తద్వారా త్వరగా నిద్రకు ఉపక్రమించవచ్చు.  అరటి పళ్లల్లో మెగ్నీషియం, పొటాషియం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రాత్రి వేళ కండరాల నొప్పులు తలెత్తకుండా చేస్తాయి. ఓట్స్ లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. నిద్రకు ముందు గోరువెచ్చని ఓట్స్వం టకం తింటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
  3.   బార్లీ గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్ది మోతాదులో తీసుకున్నా నిద్ర పడుతుంది.


గాఢ నిద్రకోసం || For deep sleep || prudhviinfoPRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT