-->

అతి వాదనా? మంచికే! || Excessive argument? Good! or Bad! || prudhviinfo

Argument


అతి వాదనా? మంచికే!

వాగుడుకాయ, వసపిట్టలాంటి భాగస్వామితో వేగలేకపోతున్నాం అని ఈ రోజుల్లో బాధ పడే యువత ఎక్కువే. అదేం వద్దండోయ్! ఇలాంటి పార్టనర్ తో బోలెడు లాభాలు. అవేంటో సరదాగా తెలుసుకుందాం రండి.

ఓపిక: ఫ్రెండ్, పార్టనర్, లవర్.. ఇద్దరిలో ఒకరిదే ఆధిపత్యం అనుకోండి. నాకు నోరు తెరిచే అవకాశమే

రావట్లేదని బాధపడొద్దు. ఎదుటివాళ్లు చెప్పేది మీటూ ఉంటే మీకు ఆటోమేటిగ్గా ఓపిక పెరిగిపోతుంది. ఎంత తక్కువ

మాట్లాడితే అంత మంచిది అని మన పెద్దలు చెబుతూనే ఉంటారుగా,

ప్రేము: చెప్పినదానికి తలాడించే భాగస్వామి దొరికితే ఎవరికైనా సంతోషమే కదా! నా పెత్తనం పెరిగిపోతుంది అని భార్య సంతోష పడుతుంది. అదే భర్తది డామినేషన్ అయితే అనువైన ఆలి దొరికిందని అబ్బాయి హ్యాపీ. సో.. ఆటోమేటిగ్గా ఇద్దరి మధ్యా ప్రేమ రెట్టింపవుతుంది..

గొడవలు:  ఆవతలివాళ్లు చెప్పింది. కిక్కురుమనకుండా వింటుంటే.. ఆలుమగల గొడవలే ఉండవు. ప్రేమికులైతే బ్రేకప్ దాకా రానే రారు. ఫలితంగా ఏ చీకూ చింత ఉండదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే పేరు వెంట పడి మరీ వచ్చేస్తుంది.

భరోసా: బాగా మాట్లాడే భాగస్వామి ఉంటే రెండో వ్యక్తికి కచ్చితంగా కరకమైన భరోసా ఉంటుంది. ముఖ్యంగా పక్కవాళ్లతో ఫైటింగ్లు గట్రా పచ్చినప్పుడు, ఇబ్బందుల్లో ఇరుక్కున్నప్పుడు తనే చూసుకుంటుంది/చూసుకుంటాడులే అని నిశ్చింతగా ఉండొచ్చు. 

బోర్ ఉండదు: వినడంలోని మజుని చూడగలిగితే మన సంతోషాలు డబుల్, ఆవతలివాళ్లు అలవోకగా కబుర్లు చెప్పేస్తుంటే ఎఫ్.ఎం., ఓటీటీ, సోషల్ మీడియా అన్నీ మన ముందు ఉన్నట్టేగా


అతి వాదనా? మంచికే! || Excessive argument? Good! or Bad! || prudhviinfo PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT