తల్లిదండ్రులను మరవద్దు
అందరినీ మరచినా నీ తల్లిదండ్రులను మరువవద్దు. వాళ్ళను మించి నీ మంచి కోరే వారెవరూ ఉండరని తెలుసుకో. నువ్వు పుట్టాలని రాళ్ళకు పూజలు చేశారు వారు. ..
రాయివై వారి హృదయాలను ప్రక్కలు చెయ్యవద్దు.
కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు వారు.
నీకు అమ్మ తమిచ్చిన వారిపైననే నువ్వు విషాన్ని విరజిమ్మవద్దు. ముద్దు మురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు.
ఆ ప్రేమ మూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు. నువ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానమౌతాయా? అంతా వ్యర్థమే సేవాభావం లేక, గర్వం పనికిరాదు.
సంతానం వల్ల సుఖం కోరుతావు. నీ సంతాన ధర్మం మరువవద్దు. ఎంత చేసుకొంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు.
నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడిపొత్తుల్లో పడుకోబె ట్టారు
అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళల్లో అశ్రువులను నింపకు.
నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు.
ఆ మార్గదర్శి లకు నీవు ముళ్ళు వై వారిని బాధించ కూడదు
డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు తల్లిదండ్రులు మాత్రం మళ్ళీ సంపాదించ లేవు.
వారి పాదాలు గొప్పదనం జీవితాంతం మరవద్దు.
" మాతృదేవోభవ పితృదేవో భవ"
తల్లిదండ్రులను మరవద్దు || Don’t forget the parents || PRUDHVIINFO