![]() |
Does the boiled water have a taste? |
కాచిన నీటికి రుచి వుంటుందా!
మరగకాచిన నీరు చప్పగా వుంటుంది. ఎందుకంటే సాధారణంగా కొన్ని లవణాలు కరిగి వుండటంతో తాగేనీటికి రుచి వస్తుంది. మరగ కాచిన నీటికి రుచి వుండదు. రుచి ఏర్పడటానికి కొన్ని కారణాలు వున్నాయి. వర్షపునీరు మేఘాలలో నుంచి కిందపడే లోపుగా వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్వా యువును పీల్చుకుంటుంది. ఆ నీరు భూమి మీద పడిలోపలి పొరలలోకి చొచ్చుకొని పోతున్నపుడు సున్నపురాతి పొరలలో వుంటూ, ఇంకా కరగని కాల్షియం కార్బొనేట్ ను కరిగే బైకార్బోనేట్ గా మార్చి తనలో విలీనం చేసుకుంటుంది. బైకార్బొనేట్ లవణం ద్వారా నీటికి ఒకరుచి ఏర్పడుతుంది. నీటిలో కరిగి వున్న కార్బన్ డై ఆక్సైడ్, నీటిని శుభ్రం చేసేందుకు వాడే క్లోరీన్ మొదలైనవి కూడా నీటికి రుచిని కలిగిస్తాయి. నీటిని మరగకాచినప్పుడు అందులోని వాయువులు వెలుపలికి వెళ్ళిపోతాయి. కార్బన్ డై ఆక్సైడ్ ను కోల్పోవడం వలన బైకార్బోనేట్ తిరిగి కార్బొనేట్ గా మారి, దాని అవక్షేపంగా మిగిలిపోతుంది. ఈ లవణాలు, వాయువులు అన్నీ పోవడంతో మరగకాచి చల్లార్చిన నీరు రుచిని కోల్పోతుంది. అనారోగ్యం కలిగినప్పుడు కాచి చల్లార్చిన నీటిని తాగడమే మంచిదని చెబుతుంటారు. రుచి లేకపోయినా కాచి చల్లార్చిన నీరే ఆరోగ్యానికి అన్ని సమయాలలోను మంచిది.
కాచిన నీటికి రుచి వుంటుందా! || Does the boiled water have a taste || prudhviinfo