పురుషుడు వివిధ పాత్రలు ధర్మాలు
◆◆◆◆◆◆◆◆◆●◆◆◆◆◆◆●◆◆◆◆◆◆◆◆◆●◆◆◆◆◆◆●◆◆◆◆◆◆◆◆◆●◆◆◆◆◆◆●◆◆◆◆◆◆◆◆◆●◆◆◆◆◆◆●
పరమాత్మ రూపమైన బీజ స్వరూపాన్ని ధరించిన పురుషుడు పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు వివిధ పాత్రలను ధరిస్తాడు.
కుమారునిగా
తల్లిదండ్రులను దైవ స్వరూపులుగా కలుస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి వంశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన వలసిన గురుతర బాధ్యత ఉంది కనుక దానికి అనుగుణంగా నడిచే బిడ్డల
వలనతల్లిదండ్రులు ఎనలేని మనశ్శాంతిని, సంతోషాని, కీర్తిని పొందుతారు. విద్యార్జన సమయంలో ఇతర ఆలోచనలకు తావివ్వకుతాను ఏ చిన్న పొరపాటు చేసిన ,తనకు తన కుటుంబానికి తన సమాజానికి తద్వారా తన దేశానికి చెడ్డ పేరు వస్తుంది అనే భావనతో నీతివంతంగా జీవించవలసిన అవసరం ఉంటుంది
యువకునిగా
నేటి యువత ఎక్కువ మంది ఒక దిశా నిర్దేశం లేకుండా ఒక లక్ష్యం లేకుండా,జీవితం గడపడం చాలా బాధకలిగించే విషయం, నేడు మీడియా ప్రచారం వల్ల సినిమాల
ప్రభావం వలన పరిసరాల వలన, తల్లిదండ్రుల పర్యవేక్షణ తగ్గడం వలన యువత ప్రభావం సినిమాలకు, షికార్లకు, జులాయి తిరుగుళ్లకు, గుట్కాలకు, తాగుడుకు, జూదానికి, ఆఖరుకి వ్యభిచారానికి కూడా అలవాటుపడటం కడు శోచనీయం. ఇలాంటి బిడ్డలను కన్నతల్లిదండ్రుల పరిస్థితి మనం చెప్పనవసరం లేదు కదా ! కనుక యువకులారా ! ఒక్క విషయాన్నీ గమనించండి. మన తల్లితండ్రులు, మన సమాజం, యువత పైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. జాతీయ శక్తి అయిన యువత నేడు నిర్వీర్యంకాకుండా చూడవలసిన బాధ్యత ఉంది. అందువలన యువత యొక్క ప్రధమ కర్తవ్యం "లక్ష్య నిర్దేశం చేసుకొనడం దానికి సక్రమ మార్గంలో కృషి చేసి తమ తల్లిదండ్రులకు సంతోషాన్ని కల్గించడం, తాను ఆనందాన్ని, అభివృద్ధిని పొందడం, ఇతరులకు ఆదర్శంగా నిలవటం. భర్తగా: | ఎన్నో ఆశలతో, ఆలోచనలతో, భయాలతో, జంకుతూ మన వంశ అభివృద్ధికి మనకు, తోడూ నీడగా ఉండటానికి భార్య రూపంలో వచ్చిన దైవశక్తిని మనం ప్రేమగా అక్కున చేర్చుకోవలసిన బాధ్యత ఉంది. ఆమె యొక్క వ్యక్తిత్వాన్షి గౌరవిస్తూ, ఆమె తరహా వాళ్లని చులకనగా మాట్లాడి ఆమెను బాధించకుండా, ఆమె చేసే ప్రతి పనిని విమర్శించి వేదించకుండా ఒక ఆదర్శవంతమైన భర్తగా ఆమె బలహీనతలను క్షమిస్తూ, ఆమె పాత్ర అమె సక్రమంగా నిర్వర్తించడానికి సహకరించాలి. నీది, నాది, నీ వారు, నా వారు అని కాకుండా మనది, మనవారు అనే సమ భావనతో ఇద్దరూ అన్యోన్యంగా ఉంటే కలిగ్ఆనందం తద్వారా కలిగే సమాజ శ్రేయస్తు వర్ణనాతీతం.
తండ్రిగా
ఒక తండ్రిగా మనం మన బిడ్డలకు కావలసిన అవసరాలు తీర్చడమే కాక వారి బాగోగులను పట్టించుకోవలసిన బాధ్యత కూడా ఉంది ది బిడ్డల చదువు విషయం వారి ప్రవర్తన వారి స్నేహాలు తిరుగులేని కూడా తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది
వారు ఏదైనా తప్పు దోవ పడితే సరిచేయకపోతే అది కుటుంబానికి నష్టమే కాకుండా సమాజానికి కీడు చేసిన వారవుతారు కనుకబిడ్డల మంచి చెడ్డల బాధ్యత తండ్రిదే.
తాతగా:

ఒక తాతగా, కుటుంబ సభ్యులను విసిగించకుండా పెట్టింది తింటూ, చెసి, వింటూ, వారికి అవసరమై అడిగితే సలహాలను ఇస్తూ హుందాగా వ్యవహరిస్తూ , తెలుసునే ప్రయత్నం చేస్తూ ఆదర్శ తాతలుగా అందరి ఆదరాభిమానాలు చూరగా వారి వలన ఎవరికి అశాంతి కలుగనివ్వకుండా చూడవలసిన బాధ్యత ఉంది. అలాగే ఒక ఉద్యోగిగా, వ్యాపారస్తునిగా, అధికారిగా, పనివానిగా, వ్యవసా దారునిగా, యజమానిగా, గృహస్థునిగా తమతమ విద్యుక్త ధర్మాలను చక్కగా పాటిస్తూఉంటే తాము ఎనలేని మనశ్శాంతిని సంతృప్తిని పొందడమే కాకుండా సంఘ శ్రేయ స్సు కుఉపయోగపడిన వాళ్లగుదురు. అని సవినయముగా మనవి చేస్తున్నాము.