-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

చందమామ రావే ఫోన్లో ఒదిగిపోవే || Chandamama Rave || prudhviinfo

Chandamama Rave (moon)

 

చందమామ రావే ఫోన్లో ఒదిగిపోవే..

చల్లటి రాత్రి. అందమైన  చందమామ. చేతిలో స్మార్ట్ ఫోన్. ఫొటో తీయకపోతే ఎలా? అవును. రాత్రిపూట చందమామను కెమెరా కన్నుల్లో బంధించటం ఇప్పుడో ట్రెండ్. కరోనా మహమ్మారి ఆందోళనను తగ్గించుకోవటానికో, తమలోని కళను చూపించుకోవటానికో గానీ చాలామంది దీన్నే అనుసరిస్తున్నారు. తగిన  స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఇక చెప్పేదేముంది?

  రోజులు, నెలలు గడచి పోతున్నాయి. పనులు, ఉద్యోగాలు, చదువులు అన్నీ ఇంటి నుంచే, ఈ పరిస్థితి ఇంకెంత కాలం

కొనసాగుతుందో తమలోని నిరాశా నిస్పృహలు పోగొట్టుకోవటానికి, కాస్త హుషారును సొంతం చేసుకోవటానికి అలా బాల్కనీలోకి రావటం.. చుట్టుపక్కల పరిసరాలను గమనించటం పరిపాటిగా మారిపోయింది. ఆకాశం వంక చూస్తూ.. మిణుకు మిణుకుమనే నక్షత్రాలను, వెన్నెలను కురిపించే జాబిల్లిని పరికిస్తూ.. పనిలో పనిగా తమ కళాత్మక దృష్టికి చాలామంది పదును పెడుతున్నారు. చందమామ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ పరవశించి పోతున్నారు.

    నిజానికి స్మార్ట్ ఫోన్ తో జాబిల్లి ఫొటో తీయటం చిన్న విషయమేమీ కాదు. చందమామ చాలా దూరంలో ఉంటాడాయె. కెమెరా లెన్స్ చాలా నాణ్యమైనదైతే తప్ప ఫొటోలో స్పష్టంగా  ఒదిగిపోడు. అంటే బేసిక్ టెలీఫోటో లెన్స్ కన్నా మరింత మెరుగైనదే కావాలన్నమాట, చందమామను జూమ్ చేసిన కొద్దీ ప్రకాశవంతంగా కనిపిస్తుంటాడు గానీ దృశ్యం బ్లర్ అవుతుంటుంది. తక్కువ వెలుతురులో మంచి ఫొటో తీయటమూ కష్టమైపోతుంటుంది. మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే ఇదేమీ పెద్ద కష్టం కాదు. సరేగానీ ఇందుకోసం అనువైన ఫోన్లు ఏం ఉన్నాయి. చాలానే ఉండొచ్చు. కొన్నింటిని పరిశీలిద్దాం.


 చందమామ రావే ఫోన్లో ఒదిగిపోవే  || Chandamama Rave || prudhviinfo