నీటిలో శిల్పాల మ్యూజియం
మ్యూజియం అనగానే విశాలమైన ప్రాంగణంలో ఉన్న పురాతన చారిత్రక వస్తువుల గుర్తుకు వస్తాయి. కానీ మెక్సికోలో నీటి అడుగున 500 శిల్పాలతో ఒక మ్యూజియం ఏర్పాటు చేవారు. ఈ ప్రాంతంలో పర్యాటకలు, డైవర్స్ వల్ల తీరం బాగా దెబ్బతింటుందని గ్రహించిన స్థానిక నేషనల్ పార్క్ డైరెక్టర్, ఆండర్ వాటర్ మ్యూజియంకు డిజైన్ చేసి, దేశాధ్యక్షుడి అనుమతితో 2005లో నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడీ మ్యూజియం రకరకాల వస్తువులతో సందర్శనలను ఆకర్షిస్తూ, డైవర్స్ కి ఒక విడిదిలా కూడా ఉపయోగపడుతోంది. 2009లో ప్రారంభించినప్పటికీ 2010 నుంచి ఆధికారిగా పర్యాటకులను అనుమతిస్తున్నారు. ఈ మ్యూజియంను సందర్శించాలంటే తప్పకుండా ఈత నేర్చుకోవాల్సిందే.
ఈ రికార్డులకెక్కిన ట్రీహౌస్...
ట్రీ హౌస్ అంటే చెట్టుమీద కట్టిన ఒక చిన్నగూడులాంటిదనుకోకండి. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ట్రీ హౌస్. పెరుగుతున్న వాతావరణ కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగమే. సింగపూర్ లో నిర్మించిన ఈ ట్రీ హౌస్. ప్రపంచంలోనే అతిపెద్ద వర్టికల్గా ర్డెన్ గా ఇది గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ భవనం వెలుపలి భాగంలో, దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొక్కలు పంచుతున్నారు. దీని ద్వారా ఏటా దాదాపు 50 లక్షల డాలర్లు విలువచేసే శక్తినీ, నీటినీ ఆదా చేస్తున్నారట. దీని నిర్మాణంలో వాడిన మోషన్ సన్సార్లు గాలిలోకి దూళి, దుమ్ము, కార్బన్ కారకాలను గుర్తించి లోపలకు వెళ్లకుండా అడ్డుకుం టాయట. గాలిని పడబోసే ఈ పద్ధతివల్ల 15 నుంచి 30 శాతం వరకు శక్తి ఆదా అవుతుందట. ,