![]() |
why are there fingerprints |
వేలిముద్రలు ఎందుకు ఉంటాయి?
జవాబు: వేలిగుర్తులు రూపొందే ప్రక్రియ రక్తనాళాల పెరుగుదలను పోలివుంటుంది. ఇది కేవలం జన్యు కణాల మీదనే ఆధారపడి వుండదు. కణాలలో హార్మోన్ల పెరుగుదల, ప్రమాణం వంటి సూక్ష్మ అంశాలు కూడా ఈ ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. అందువల్ల వీటిలో ఏమాత్రం తేడా ఉన్నప్పటికీ ఇది వేలిముద్రలలో ప్రతిఫలిస్తుంది. జన్యుకణాల మీద అనేక అంశాల ప్రభావాన్ని అనుసరించి వేలిముద్రలు ఏర్పడతాయి. గర్భంలోని పిండం చుట్టూ ప్రవహించే ఆమ్నియో ద్రవంలో తేడాలు కూడా ఇందుకు కారణం. కవలలు ఒకే గర్భంలో ఉన్నప్పటికీ వేర్వేరు పిండాలుగా ఉండటం వలన వాటి చుట్టూ ప్రవహించే ద్రవాలలో తేడాలు ఉంటాయి. పిండాల మీద కలిగించే ఒత్తిడి కూడా మారుతుంది. ఇదే కవలల వేలిముద్రలలో సైతం తేడాలు రావడానికి కారణమవుతుంది.
వేలిముద్రలు ఎందుకు ఉంటాయి? || Why are there fingerprints? || prudhviinfo