![]() |
responsibly |
బాధ్యతలు నెరిగి ప్రవర్తించడమే ధర్మం
బాధ్యతల నెరిగి ప్రవర్తించటమే ధర్మం: సాధారణంగా, హక్కులు గుర్తున్నంతగా, భాద్యతలు గుర్తుకు రావు. హక్కుల గురించి ఆరాటపడటంలోను, పోరాటం | చేయటంలోను, పుణ్యం కాలం గడచిపోకూడదు. బాధ్యతలను గుర్తించటం, విస్మరించకూడదు. బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించడం మన బాధ్యత అని గుర్తుంచుకోవాలి. సరిగ్గా నిర్వహించిన బాధ్యతలే విజయాలను తెస్తాయి. మన హక్కులు, ఇతరుల బాధ్యతలు అయినట్లే, ఇతరుల హక్కులు మన బాధ్యతలు అనే ధ్యాస మంచి ప్రేరణను ఇస్తుంది. అందరూ ! తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే, వేరెవరూ తమ హక్కుల గురించి ఆరాటపడవలసిన అవసరం ఉండదు. పని దొంగతనాలకు దొంగ పనులకు ఆస్కారం ఉండదు. . “బాధ్యత గుర్తెరిగిన మనిషి" అని, అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు " అనే పేరు తెచ్చుకోవటం, జీవితంలో పైకి రావటాని అవసరంఅని గుర్తించండి. 'చిన పనులు కదఅని నిర్లక్ష్యం చేయటం మంచిది కైకాదు. అలానే, సాంత పనులను జాగ్రత్తగా చేసుకుంటూ, ఆఫీసు పనులను గాని, లేక ఇతర పనులను గానీ, నిర్లక్ష్యంగా చేయటం బాధ్యతాయుత ప్రవర్తన అనిపించుకోదు. సరిగ్గా నెరవేర్చిన బాధ్యతలు ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తాయి.
కొత్త బాధ్యతలను స్వీకరించే , ప్రోత్సాహాన్ని అందిస్తాయి. క్రమ శిక్షణ, నైపుణ్యం, నీతి నియమాల పాలన, మొదలైన లక్షణాలు అభివృద్ధి చెంది, మంచిపేరు తెచ్చి పెడతాయి. ఈ లక్షణాలు చేసేవాని మిత్రులుగా కావాలని ఎక్కువమంది కోరుకుంటారు. పదిమంది కలసి పనిచేయడం, అందరూ తమ తమ బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వర్తించడం అలవాటు అవుతుంది. నాయకత్వ లక్షణాలు అలవాటవుతాయి.వ క్తి స్వార్ధం వెనుకంజ వేసి, సమిష్టి కార్యాచరణకు ప్రాధాన్యతనిచే మనస్తత్వం అలవడుతుంది. సక్రమంగా నిర్వహించిన చిన్న చిన్న బాధ్యతలే | బావిషత్తులో పెద్ద పెద్ద బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించే అవకాశాలను కలిగిస్తాయి. అనుభవం ఉపయోగానికి వస్తుంది. అలవాటు అదుకుంటుంది. విజయం సిద్ధిస్తుంది. ఆత్మ విశ్వాసం మరింకింత పెరుగుతుంది. నెరవేర్చిన బాధ్యతలు తృప్తినిస్తాయి. ఆనందాన్ని అందిస్తాయి. సమాజంలో ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తాయి. సంపదను పెంపొందిస్తాయి. ఆ పెరిగిన సంపదలో మన భాగం కూడా పెరుగుతుంది.
అదృష్టవశాత్తు, చిన్నతనంలోనే బాధ్యతలను తెలుసుకొని, చక్కని సూర్తితో మెలగటం అలవాటైతే, అది మంచిదే. కానీ, చిన్నపుడు తల్లిదండ్రుల గారాబం వల్లనో, పెరిగిన పరిసరాల ప్రభావం వల్లనో, బాధ్యత లేకుండా బ్రతికాం కాబట్టి, "అలానే కొనసాగిద్దాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన బాధ్యతలను స్వీకరించడం కష్టం" అని అనుకోవద్దు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఏ వయస్సులోనైనా బాధ్యతలను గుర్తెరిగి మసలుకోవటు మంచి చేస్తుంది." - బాధ్యతగా జీవించడం అంటే, ధర్మాన్ని ఆచరించడమే. బాధ్యతకు ధర్మానికి అంత దగ్గర సంబంధం ఉంది. ధర్మాన్ని ఆచరించం అంటే, బాధ్యతతో మెలగటమే అవుతుంది. ధర్మాపరంగా వివిధ మతాల అంతరార్థం ఒకటే. ఆచారాలు, పద్దతులు వేరైనంత మాత్రాన ధర్మాన్ని తృణీకరించటం తప్పు అవుతుంది. మతలకి అతీతమైన ఆధ్యాత్మిక అవగాహనతో జీవించటం మానవధర్మం కావాలి. అన్నింటా, అందరిలోను దివ్య త్యాన్ని గుర్తించగలగాలి. సమాజానికి మంచిచేసే స్పృహతో, స్వార్థాన్ని తగ్గించుకుని హృదయంలో ప్రేమను నింపుకుని ప్రవర్తిస్తే దైవత్వం సాక్షాత్కరిస్తుంది ఆసాక్షాత్కరించే దైవత్వం, ఇతరులలో నిద్రాణంగా ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పటానికి వినియోగించాలి. తన్నుతాను ముందుగా ఉద్దరించు లెసంతమేరకు ఇతరులను ఉద్దరించటానికి ప్రయత్నించడమే ధర్మం అనిపించుకుంటుంది. బాధ్యతాయుత ప్రవర్తన అవుతుంది. "ప్రపంచం అంతా మారిన తరువాత ఆలస్యం చేయకుండా, నేను వెంటనే మారతాను" అని ఎదురుచూడటం న్యాయం కాదు. ఎవరికి తమకు చేతనైనంతగా మంచి వైపు పయనిస్తూ ఉండాలి. ఇలా అందరూ ప్రయత్నిస్తే, ఏ కొంచెమైనా ప్రపంచంలో మార్పు రావటానికి దోహదం జరవుతారు. 'నీవు ముందు, నీను తర్వాత' అని కాకుండా 'నేనే ముందు' అనే భావనతో ముందు కెళ్ళటం బాధ్యతాయుత ప్రవర్తనను సూచిస్తుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల బాధ్యతలను నిర్వర్తించండి. “అంతా అమ్మ దయే!" కాదంటారా? మాతృత్వాన్ని గౌరవించడం మరచిపోవద్దు.
బాధ్యతలు నెరిగి ప్రవర్తించడమే ధర్మం || Virtue is to behave responsibly || prudhviinfo