![]() |
Repentance |
పశ్చాత్తాపం
●●●●●●●●●●●●●● ●●●●●●●●●●●●●● ●●●●●●●●●●●●●● ●●●●●●●●●●●●●●
మద్యపానం,మాంస హారం,జూదం,
పర స్త్రీ లేక పర పురుష వ్యామోహం ఈ నాలుగు మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎంతో విశేషమైన మానవ జన్మను ధ్వంసం చేస్తాయి . ఈ చెడు వ్యసనాలు మనిషి అందః పాతాళానికి నెట్టివేస్తాయి . మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని లేకుండా చేస్తాయని వేదమంత్రం సందేశం ఇస్తుంది . ఈ విషయాలలో చిక్కుకున్న మనిషి మనస్సు హృదయం , ఆత్మ కలుషితమౌతాయి. అందుకే ప్రతి వ్యక్తి ఆత్మ శోధనమనే తన జీవన గ్రంధాని ప్రతి దినము పరిశీలించాలి . మనం చేసిన మంచి, చెడు పనులన్నీ క్రమంగా కన్పిస్తాయి. శ్వాస స్థంభించినప్పుడు, మృత్యుదేవత మన ముందు గెలిచి త్వరగా రమ్మని ఆహ్వానించినప్పుడు ఈ పుస్తకం తనకు తానుగా తెరిచి ఉంటుంది అప్పుడు మానవుడు ఆ సమర్థుడై అత్యధికంగా ఆ పుస్తకాన్ని చూస్తాడు. అందులో అతడు చేసిన దుష్కర్మలు ఎన్నో కన్పిస్తాయి. అప్పుడవి ఎంత మాత్రము మార్చజాలవు. భయముతో శరీరం కంపిస్తుంది. అతనికి ను వెంట ఆనాడు పరుగులు పెట్టాడు. అపుడు దైవాన్ని, ధర్మాన్ని విస్మరించాడు. మృత్యువు సమీపించగానే కన్నుల నుంచి ఏకధారగా కన్నీరు ప్రవహిస్తుంది ఇదంతా దుష్కర్మల ఫలం. మనిషి తన జీవితంలో సత్కర్మలు ఆచరిస్తే ఈ దుఖము ఉండదు. అలాంటి వారికి మరణ సమయములో కన్నీరు రాదు. అందులో అతడు చేసిన పరోపకారము, ధర్మ పారాయణ, సత్యసంధత, మంచి పుస్తకాలు చదవడం, విద్యా దానం చేయడం, అనాధలను రక్షించడం,
దు ఖితులను ఆదుకోవడం, పరస్త్రీలను తల్లివలె భావించడం, అందరితో సేహ భావముతో వర్తించడం, ప్రాణులను కరుణించడం, పెద్దలను పూజించడం,విధ్వాంసులను సేవించడం, ధర్మ గ్రంధాలను శ్రద్ధతో చదవడం, పది మందికి మేలు చేయడం… వీటి వల్ల సజ్జనుడు తన జీవన యాత్రలో హృదయ సాధిస్తాడు. అందుకే వేదం మానవులందరూ ధర్మాత్ములు కావాలని బోధించింది. సత్యవాడు మానవులందరూ ధరాతులు కావాలని బోధించింది. సత్యవాదులు కావాలని సందేశమిచ్చింది. న్యాయవంతులు కాని ఉపదేశించింది. నీతిమంతులు కావాలని ప్రభోదించింది. మనిషి ఈ లోకంలో దైవానికి భయపడి ప్రభు భక్తి పారాయణుడు కావాలి. తాను సుఖ సంతోషాలతో జీవిస్తూ , ఇతరులకు ఆ సుఖాన్ని అందించాలి. నిస్వార్థ జీవనం వ్యక్తికి గౌరవాన్ని ఇస్తుంది సదాచార సౌశీల్యాన్ని ఎప్పుడు విడువరాదు.
ప్రతి ఒక్కరు మరొక్కసారి ఈ విషయాలను చదివి గుర్తుకు చేసుకొని ఆచరించాలని కోరుకుంటున్నాను......