![]() |
Makkah Royal Clock Tower |
అతి పెద్ద గడియారం ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం ఉంది. మరి అది ఎక్కడ? ఎ విధంగా ఉన్నదో తెలుసుకుందాం.
సౌదీ అరేబియాలోని మక్కాలో అతి పెద్ద గడియారం ఉంది. ఇది సుమారు 600 మీటర్ల (1983 అడుగులు) ఎత్తయిన టవర్ పై నాలుగువైపులా కనిపించేలా నాలుగు భారీ గడియారాలను ఏర్పాటు చేశారు. ఒకో గడియారం వ్యాసం 151 అడుగులు ఉంటుంది. రాత్రి వేళలో కనబడేలా 20 లక్షల విద్యుద్దీపాలు ఏర్పాటుచేశారు. ఈ గడియారం నిర్మాణానికి 3 బిలియన్డా లర్ల ఖర్చయింది. అంటే రూ.12 వేల కోట్ల అన్నమాట.సౌదీ అరేబియాలోని మక్కాలో అతి పెద్ద గడియారం ఉంది. ఇది సుమారు 600 మీటర్ల (1983 అడుగులు) ఎత్తయిన టవర్ పై నాలుగువైపులా కనిపించేలా నాలుగు భారీ గడియారాలను ఏర్పాటు చేశారు. ఒకో గడియారం వ్యాసం 151 అడుగులు ఉంటుంది. రాత్రి వేళలో కనబడేలా 20 లక్షల విద్యుద్దీపాలు ఏర్పాటుచేశారు. ఈ గడియారం నిర్మాణానికి 3 బిలియన్డా లర్ల ఖర్చయింది. అంటే రూ.12 వేల కోట్ల అన్నమాట.
మక్కా మసీదుకు అధిపతి అయిన రాజు అబ్దుల్లా ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన ఓ కంపెనీ ఈ గడియారం రూపకల్పన చేసింది. గడియారాల చట్రాలన్నీ బంగారంతో చేసినవే. ఆకర్షణీయంగా కనిపించడానికి వీటిని 9 కోట్ల రంగు గాజు ముక్కలతో అలంకరించారు. మొత్తం గడియారాలపై 20 లక్షల లెడ్ బల్బులను ఏర్పాటు చేశారు. గడియారాల పై 'అల్లా' అక్షరాలను 21 వేల ఆకుపచ్చ విద్యుత్ బల్బులతో ముస్తాబు చేశారు. ముస్లిములు ప్రార్ధనలు జరిపే సమయాల్లో రోజుకు అయిదు సార్లు ఇవి వెలుగుతాయి. ఈ గడియారాలు 25 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తాయి. గడియారాలను దగ్గరగా చూసేందుకు వీలుగా టవర్ పైకి లిఫ్టులు ఉంటాయి. టవర్ పైభాగంలో బంగారు చంద్రవంక రూపంలో ఏర్పాటుచేసిన లేజర్ కిరణాల వెలుగులు ఆకాశంలోకి 10 కిలోమీటర్ల దూరం వరకూ కనిపించేలా ప్రకాశిస్తాయి.
అతి పెద్ద గడియారం ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం ఉంది. మరి అది ఎక్కడ? ఎ విధంగా ఉన్నదో తెలుసుకుందాం. || అతి పెద్ద గడియారం ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం ఉంది. మరి అది ఎక్కడ? ఎ విధంగా ఉన్నదో తెలుసుకుందాం || do you know || prudhviinfo