![]() |
జనవరి 1 నూతన సంవత్సరాది
డిసెంబరు 31 రాత్రి ఒక సంవత్సరానికి ముగింపు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు చేసుకుంటాం. అసలు ఈ కాల నిర్ణయం ఎలా జరిగింది? క్రీస్తు పూర్వం 45లో జూలియస్సీ జర్ ఒక క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే 365 రోజుల ఆధారంగా క్యాలెండర్ని రూపొందించారు. అలాగే భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 24 గంటల సమయం పడుతుంది.
ఆ విధంగా రోజులను, కాలానికి అనుగుణంగా నెలలను విభజించి క్యాలెండర్లను తయారు చేశారు. రోమన్లకు జనవరి నెల ప్రాముఖ్యత కలిగింది. కాబట్టి ఆ నెల ప్రారంభాన్ని నూతన సంవత్సరం ప్రారంభంగా తీసుకున్నారు. కాలక్రమేణా క్యాలెండర్మారుతూ 1752లో దేశ పార్లమెంటు ఒక చట్టం తీసుకువచ్చింది. యూరతో పాటు ఇంగ్లండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేట్లు చేసింది. ప్రపంచ దేశాలన్నీ ఆ క్యాలెండర్ ని అనుసరించి జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నాయి.
జనవరి 1 నూతన సంవత్సరాది || January 1 is the New Year why? || prudhviinfo