పుట్టినరోజు జరుపుకోవడం ఎలా ||How to celebrate a birthday || PRUDHVIINFO
 |
BIRTHDAY |
- పిల్లలకు తమ పుట్టినరోజు పండుగ చేసుకోవాలని మహా ఉత్సాహంగా ఉంటుంది. ఆ రోజు వారికి గొప్ప ఆనందంగా ఉంటుంది. కాని మన బానిస మనస్తత్వం కారణంగా మనం ఆ రోజు కూడా పిల్లలపై ఆంగ్ల సంస్కృతి ముద్ర వేస్తూ మన పట్ల, వారి పట్ల తీరని అన్యాయం చేస్తున్నాము. పిల్లల పుట్టిన రోజునాడు మనం 'కేక్' తయారు చేసి, ఎన్ని సంవత్సరాలు నిండాయే ఆన్ని మైనపు వత్తులు కేకుపై పెడతాం. తర్వాత అవి వెలిగించి మళ్ళీ ఊది ఆర్పివేస్తాం మనం ఎలాంటి విరుద్ధమైన దిశలో నడుస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. దీపాలు
- వెలిగించి వలసిన చోట వాటిని ఆర్పి వేస్తున్నాము . స్వచ్ఛమైన పదార్థాలు తినవలసిన వేళ
- ఉఫ్మ మని ఉ దగా పడిన ఉమ్మితో ఎంగిలి అయిన కేకు ను ప్రీతిగా ఆరగిస్తున్నాము. పేదవాళ్లకు అన్నం పెట్టాల్సిన సందర్భాన పెద్ద పెద్ద పార్టీలు ఏర్పాటు చేసి వృధాగా డబ్బు ఖర్చు చేస్తున్నాము ఈనాటి మన సమాజం ఎoతటి విచిత్రమైనది
- మన పిల్లలకు వారి పుట్టిన రోజునాడు భారతీయ సంస్కార్ పద్ధతుల ప్రకారం గానే వ్యవహరించడం నేర్పించాలి . దీని వల్ల ఆ అమాయకులు ఆంగ్లేయులుగా కాక భారత పౌరులుగా రాణిస్తారు
- మిపిల్లవాడికి 11వ ఏడు వచ్చిందనుకొందాం అప్పుడు కొన్ని అక్షింతలు ఓ.. పసుపు, కుంకుమ, సింధూరం పంటి మంగళ ద్రవ్యాలు కలిపి వా తితో స్వస్తిక్ ఆకారంలో చేయండి . దానిపై 11 చిన్న చిన్న దీపాలు పెట్టి, పన్నెండో ఏటికి గుర్తుగా ఒక పెద్ద దీపం పెట్టాలి. ఇక ఇంట్లోని పెద్ద వాళ్ళతో అన్ని దీపాలను వెలిగింపజే సి పిల్ల వారు పెద్దవారికి నమస్కరించి, వారి ఆశీర్వాదం పొందాలి.
- ఈ పార్టీలలో వ్యర్ధంగా ఖర్చు చేసే బదులు పిల్లల చేతి మీదుగా పేదలకు, అనాద శరణాలయాల్లో అన్న-వస్త్రాలను పంచి పెట్టించి, ధనాన్ని సత్కర్యాలకు వినియోగిo చే మంచి అలవాట్లను పెంపొందించాలి.
- వచ్చిన వాళ్ళ నుంచి బహుమతులు తీసుకోవడానికి బదులుగా పిల్లల్లో దానగుణం పెంచాలి. దీని వల్ల తీసుకోవడం కాక ఇచ్చే స్వభావం బలపడుతుంది.
- పిల్లలతో కొత్త పనులు చేయించి వారిలో దేశహిత భావాన్ని పెంచాలి. చెట్లు నాటించడం మొదలైనవి. . 👉పిల్లలు ఇవాల్టి రోజున క్రితం సంవత్సరం గురించి ఆలోచించే లాగ చెయ్యాలి. అంటే గత ఏడాది ఏ ఏ మంచి పనులు చేశారు? చెడ్డ పనులేమేమి చేశారు? లాంటివి. చేసిన మంచి పనులను భగవంతుని పాదాలకు సమర్పించి చెడ్డ పనులను మరిచిపోయి వాటిని మళ్ళీ చెయ్యకుండా సన్మార్గంలో నడిచేందుకు సంకల్పించుకోవాలి.
- కొత్త సంవత్సరంలో చదువు, సాధన, సత్కర్మ, సత్యం, నిజాయితీలతో ముందుకుసాగి తల్లి దండ్రులకు, దేశానికి పేరు తేవాలనే సంకల్పం కలిగించాలి.
- పైన పేర్కొన్న సిద్ధాంతాల ప్రకారం మనం మన పిల్లల పుట్టినరోజు జరుపుతుంటే దానర్థం మనం వారికి భౌతికంగా ఏమీ ఇవ్వలేకపోయినప్పటికీ ఈ సంస్కారాలతోనే వారిని గొప్పవారిగా మార్చగలమన్న మాట. వారిని సువాసన వెదజల్లే పుష్పాలుగా మార్చి తమ సుగంధాలతో ఇంటిని, పొరుగింటిని, నగరాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్నే గాక మొత్తం ప్రపంచాన్నే మైమరపింపజేయగలం.
- గౌరవనీయులైన తల్లిదండ్రుల రా పుట్టిన రోజులు ఆర్భాటంగా చేయడం అవసరమా ? అనాధ శరణాలయములు వృద్ధాశ్రమంలో మీ పిల్లల పుట్టిన రోజులు చేయండి.
- వృద్ధాశ్రమంలో పెద్ద వాళ్ళు ఎందుకు ఉన్నారో వాళ్ళ కుఅర్థం అవుతుంది. పెద్ద అయినంక మిమ్మల్ని కూడా వృద్ధాశ్రమంలో చేర్పించ కుండా ఉంటారు.