
How light is transmitted from an electric bulb.

విద్యుత్ బల్బు నుంచి కాంతి ప్రసారం ఎలా ఉంటుందంటే..
మొట్టమొదటగా విద్యుచ్ఛక్తి దీపాన్ని థామస్ ఆల్వా ఎడిసన్ 1878లో కనుగొన్నారు. తీగల గుండా విద్యుత్ ప్రవహించేటప్పుడు కాంతి, ఉష్ణం పుడతాయన్న సిద్ధాంతం ఆధారంగా ఈ విద్యుత్ దీపం తయారైంది. వాస్తవానికి ఈ దీపం విద్యుత్ ను ఉష్ణంగాను, కాంతిగాను మారుస్తుంది. ఇటువంటి కాంతి సాధనాలను “ఇన్‌కాండిసెంట్ లాంప్స్" అంటారు.
ఎడిసన్ తయారుచేసిన మొదటిదీపం గాజు బుడ్డిలో ప్లాటినంచుట్ట అమర్చి సీలువేశారు. ఆ చుట్ట రెండు కొనలను విద్యుత్ తో కలిపినపుడు ఎరుపు దనంతో వేడిగా అయి కాంతిని వెదజల్లసాగింది. అయితే ప్లాటినం చాలా ఖరీదైనది కావడంతో దానివాడకం నిలిపి వేశారు. ఈ బల్బ్ లలో ఉపయోగించే ఫిలమెంటు వివిధ రకాల లోహాలతో చేస్తారు. కార్బన్ ఫిలమెంట్లను, టంగ్స్టన్, టాంటలమ్ తీగలను ఉపయోగించి ప్రయోగాలు చేశారు. ఈనాటి ఇన్కాండి సెంట్బ ల్బులలో చుట్టగా చుట్టిన టంగ్ స్టన్ ఫిలమెంట్ గాజు దీపంలో సీలు వేయడం జరుగుతుంది. ఫిలమెంట్ రెండు కొనలను దళసరి వైరుకు జతచేస్తారు. రెండు వైరులు గాజు గొట్టం ద్వారా వెలుపలికి వస్తాయి. ఆ తరువాత గాజుబుడ్డిలోని గాలిని వెలుపలికి తీసి, నైట్రోజన్, ఆర్గాన్ వాయువులను నింపుతారు. బల్బ్ పగిలినప్పుడు శబ్దం రావడానికి కారణం ఈ బంధించి ఉంచిన వాయువులు వెలుపలికి రావడమే.
ఈ వాయువులను నింపడం వలన ఫిలమెంట్ ఉష్ణోగ్రత వలన కరిగిపోకుండా ఉంటుంది. వెలుపలికి వచ్చిన తీగలు రెండు కలవకుండా ఉండటానికి ప్లాస్టిక్ పదార్ధాన్ని క్యాలో నింపుతారు. విద్యుచ్ఛక్తి ఫిలమెంట్ ద్వారా ప్రవహించినప్పుడు అది ముందుగా ఎర్రగా అయి, వేడెక్కి తెల్లబడుతుంది. ఈ ఫిలమెంట్ వల్లనే కాంతి వెలువడుతుంది. ప్రకాశం ఏర్పడుతుంది. దేనినైనా ఎర్రగా కాలిస్తే వెలుగు వస్తుందన్న సూత్రం ఆధారంగానే ఫిలమెంట్ అని పిలిచే సన్నటి వైరులోకి విద్యుచ్ఛక్తి పంపిస్తే, అది వేడెక్కుతుందని చెప్పవచ్చు. వైర్లు, ఇతర విద్యుద్వాహకాలు విద్యుచ్ఛక్తిని తమ వద్దనే నిలిచిపోయేలా నిరోధిస్తాయి. ఆ నిరోధక శక్తిని కలిగి ఉండటం వల్లనే ఉష్ణోగ్రత పెరిగి బల్బులోని వైరు వేడెక్కుతుంది. వైరు దగ్గర ఉష్ణోగ్రత 2200 డిగ్రీల సెంటిగ్రేడ్ కు చేరుకోగానే ప్రకాశవంతమైన కాంతి పుడుతుంది.
విద్యుత్ బల్బు నుంచి కాంతి ప్రసారం ఎలా ఉంటుందంటే.. || How light is transmitted from an electric bulb || prudhviinfo
tags:-
How light is transmitted from an electric bulb, How light is transmitted from an electric bulb, how does a light bulb work, what is a light bulb, what is a light bulb and how does it work, why was the light bulb invented