![]() |
Eiffel tower Paris |
అద్భుత కట్టడం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఈఫిల్ టవర్ గురించి ఈరోజు తెలుసుకుందాం:
ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో గుస్తావా ఈఫిల్ అనే ఇంజినీర్ 1887లో ఈ టవర్ని నిర్మించారు. అందుకే ఈ టవర్ కి ఆయన పేరు పెట్టారు. దీన్ని నిర్మాణానికి రెండు సంవత్సరాల రెండు నెలల సమయం పట్టింది. 1889 మార్చి 31న పూర్తి చేశారు.
దీని కోసం 50 మంది ఇంజినీర్లు 18 వేల విడిభాగాలను ముందుగా రూపొందించి వాటిని కలిపి దీనిని నిర్మించారు. 1052 అడుగుల ఎత్తు, దాదాపు 7000 టన్నుల బరువు, 25 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈఫిల్ టవర్ ప్రపంచ అత్యున్నత కట్టడాల్లో ఒకటి. ప్రపంచంలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన కట్టడంగానూ పేరు తెచ్చుకుంది. టవర్క్ 20 టన్నుల రంగును ప్రతి ఏడేళ్లకోసారి వేస్తారు. పూర్తి చేయడానికి సుమారు 18 నెలలు పడుతుంది.
దీనిపై మొత్తం 20 వేల విద్యుత్ బల్బులు అమర్చారు. మూడు అంతస్తులుగా నిర్మించిన దీనిలో రెండు రెస్టారెంట్లు, ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి. దీంట్లో సందర్శకులకు పైకి తీసుకువెళ్ళే లిఫ్టులు ఉన్నాయి. ఈఫిల్ టవర్ చివర నిల్చుని 42 మైళ్ళ దూరం వరకు చుడొచ్చు. దీనిలో మొత్తం 1710 మెట్లు ఉన్నాయి. బలంగా గాలులు వీచితే టవర్ కాస్త ఊగుతుంది. ఇనుము వ్యాకోచ, సంకోచాల కారణంగా దీని పొడవు వేసవిలో 3.25 అంగుళాలు ఎక్కువగా ఉంటుంది.. శీతాకాలంలో 6 అంగుళాలు తగ్గుతుంది.
అద్భుత కట్టడం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఈఫిల్ టవర్ గురించి ఈరోజు తెలుసుకుందాం || Today we learn about the world famous Eiffel Tower || prudhviinfo